Sukumar: డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్!

నిర్మాతలు, ద‌ర్శ‌కుడి ఇళ్లు, ఆఫీసుల‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు ఏక‌కాలంలో దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని నిర్మాత‌, ద‌ర్శ‌కుల ఇళ్లు, కార్యాల‌యాల‌కు వ‌చ్చిన ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి.. దాడులు చేస్తున్న‌ట్టు తెలిసింది. దాడుల విష‌యాన్ని అత్యంత ర‌హ‌స్యంగా ఉంచారు. అసలు విషయానికొస్తే.. ‘ఆర్య’తో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుకుమార్.. ఆ తర్వాత మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేశారు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. దీనిపై కుమారి 21F తీసి హిట్ కొట్టారు.

ప్రస్తుతం ఆయన (Sukumar) స్క్రీన్ ప్లే, అందించిన నిర్మాణంలో భాగమైన ‘విరూపాక్ష’ రిలీజ్ కు రెడీగా ఉంది. అలానే ‘పుష్ప 2’ నిర్మాణంలో సుకుమార్ భాగమయ్యారు. అలానే సుకుమార్ రెమ్యునరేషన్స్ గురించి గతంలో చాలా వార్తలొచ్చాయి. బహుశా ఈ కారణంగానే ఆయన ఇంటిపై తాజాగా ఐటీ రైడ్ జరిగినట్లు తెలుస్తోంది. పుష్ప.. ది రైజ్‌ సినిమా గ‌త ఏడాది బాక్సాఫీసుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన విష‌యం తెలిసిందే. ఎలాంటి అంచ‌నాలు లేకుండానే తెర‌కెక్కిన ఈ సినిమా అనూహ్య విజ‌యాన్ని న‌మోదు చేసింది.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ సార‌థ్యంలో నిర్మాత‌లు నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ లు పుష్ప‌-1 మూవీని నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 175-200 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో తీసిన పుష్ప‌-1 క‌లెక్ష‌న్ల‌లో దూసుకుపోయింది. ఏకంగా.. 350 – 420 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టిన‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇక‌, ఇటీవ‌లే దీనికి సీక్వెల్ గా తీస్తున్న పుష్ప ది రూల‌ర్‌(పుష్ప‌-2) ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

ఇది కూడా అంచ‌నాలు మ‌రింత‌గా పెంచేసింది. ఈ ఏడాదిలో ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇదిలావుంటే.. పుష్ప -2 ట్రైల‌ర్ విడుద‌లైన వారంలోనే ఐటీ అధికారుల క‌న్ను ఈ మూవీ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడిపై ప‌డింది. ఈ రోజు(బుధ‌వారం) ఉద‌యం.. వారి కార్యాల‌యాలు, ఇళ్ల‌పై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌ధానంగా విచార‌ణ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఆదాయ వ్య‌యాల‌ను ప్ర‌శ్నిస్తున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా పుష్ప – 2 బ‌డ్జెట్ ను కూడా అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం పుష్ప నిర్మాత‌లు ద‌ర్శ‌కుడి ఇంటిపై ఐటీ దాడుల వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus