మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ (B. Gopal) కలయికలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘ఇంద్ర’ (Indra). 2002 జూలై 24న విడుదలైన ఈ చిత్రాన్ని ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ (C. Aswani Dutt) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 22 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 4K లో రీ రిలీజ్ అయ్యింది.అప్పట్లో ‘ఇంద్ర’ క్రియేట్ చేసిన సంచలనాల గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది.టాలీవుడ్లో మొదటి రూ.50 కోట్ల గ్రాస్ మూవీ ఇదే.
అలాగే 122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. రీ రిలీజ్ లో కూడా బుకింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. అయితే ‘ఇంద్ర’ బాక్సాఫీస్ (Indra Collections)వద్ద అప్పుడు ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.15 cr |
సీడెడ్ | 6.25 cr |
ఉత్తరాంధ్ర | 2.70 cr |
ఈస్ట్ | 2.15 cr |
వెస్ట్ | 2.00 cr |
గుంటూరు | 2.42 cr |
కృష్ణా | 2.13 cr |
నెల్లూరు | 1.35 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 26.15 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.55 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 28.70 cr |
‘ఇంద్ర’ చిత్రం రూ.18 కోట్ల(షేర్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.28.70 కోట్ల షేర్ ను రాబట్టి.. బయ్యర్లకు రూ.11.70 కోట్ల లాభాలు అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి రీ రిలీజ్ లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.