బన్ని వాస్‌ మాటల్ని అలా అర్థం చేసుకోవాలా..!

అల్లు అర్జున్‌ బాలీవుడ్ ఎంట్రీ… త్వరలో! బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడితో బన్నీ భేటీ! త్వరలోనే అల్లు అర్జున్‌ సినిమా ముచ్చట్లు చెప్తా!బన్నీ నుండి త్వరలో ఊహించని అనౌన్స్‌మెంట్‌!….పై నాలుగు.. నాలుగు రకాల స్టేట్‌మెంట్‌లలా కనిపించొచ్చు. అంతేకాదు ఇవి ఎక్కడో విన్నట్లు కూడా అనిపించొచ్చు. నిజమే మీరు చూసినవి, విన్నవే పై స్టేట్‌మెంట్‌లు. మొదటి రెండు పుకార్లుగా వినిపిస్తే.. ఆఖరి రెండు ప్రకటనల్లా వచ్చాయి. చెప్పింది కూడా బన్నీకి బాగా దగ్గరవాళ్లే.

దీంతో బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ అని అనుకున్నారంతా. కానీ రీసెంట్‌ బన్నీ మిత్రుడు, నిర్మాత అయిన బన్నీ వాస్ కొత్త మాట చెప్పారు. బన్నీ ప్రముఖ దర్శకుడిని కలిసింది సినిమా కోసం కాదు అని చెప్పారు. దీంతో టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ వేసినట్లు అయ్యింది. అయితే ఇదంతా పుకార్లకు కామా పెట్టడానికే అనే మాటలు వినిపిస్తున్నాయి. కారణం గతంలో బన్నీ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడింది.

అతని తండ్రి అల్లు అరవింద్‌ కాబట్టి. ఇంకా బన్ని వాస్‌ చెబుతున్నట్లు బన్నీ – సంజయ్‌ లీలా భన్సాలీ కలిసింది కేవలం అభినందించుకోవడానికి మాత్రం కాదని, అంతకుమించి చర్చలు జరిగాయని సన్నిహితులు చెబుతున్నారు, గతంలో చెప్పారు కూడా. ‘పుష్ప 2’ సినిమా విడుదలయ్యేంతవరకు బన్నీ ఫ్యాన్స్‌, ప్రేక్షకుల ఆలోచనల్ని వేరే సినిమా మీదకు మరల్చకుండా ఉండటానికి బన్ని వాస్‌ ఇలా అని ఉంటారు అని అంటున్నారు.

ఎందుకంటే భన్సాలీ లాంటి పెద్ద దర్శకుడితో సినిమా అంటే బన్నీ అంత త్వరగా వదులుకునే అవకాశం లేదు. అలాగే ఈ పాన్‌ ఇండియా సినిమాల కాలంలో బాలీవుడ్‌ దర్శకులు ఇప్పుడు సౌత్‌ హీరోల సినిమాలు చేయడానికి ఇష్టపడతున్నారు. కాబట్టి బన్ని వాస్ ఎంత బలంగా చెబుతున్నా… బన్నీ బాలీవుడ్‌ సినిమా వార్తలు ఇప్పట్లో ఆగడం కష్టమే. అల్లు అరవింద్‌ ఆ మధ్య ‘జెర్సీ’ ప్రమోషన్స్‌లో చెప్పినట్లు ఆ అల్లు అర్జున్‌ బాలీవుడ్‌ సినిమా ఏంటో చెప్పేస్తే సరి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus