Ante Sundaraniki Movie: రన్ టైమ్ విషయంలో నాని రిస్క్ చేస్తున్నారా?

నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా నాని అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రన్ టైమ్ చాలా ఎక్కువని తెలుస్తోంది. ఏకంగా 3 గంటల రన్ టైమ్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలంలో ఆర్ఆర్ఆర్ మినహా మరే పెద్ద సినిమా ఇంత రన్ టైమ్ తో రిలీజ్ కాలేదు. అంటే సుందరానికి మేకర్స్ ఒక విధంగా రన్ టైమ్ విషయంలో రిస్క్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. నజ్రియా నజీమ్ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం. వివేక్ ఆత్రేయ సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యూత్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సక్సెస్ తర్వాత నాని నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం. నాని ఒక్కో సినిమాకు ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. నాని సినిమాలు పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కుతుండటంతో నిర్మాతలు సైతం నాని అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాని హీరోగా దసరా అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. నాని తర్వాత సినిమాలతో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus