పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తుంది. 2022 లో విడుదలైన మొదటి పెద్ద సినిమా కావడంతో ఎక్కడ చూసినా.. ఈ మూవీ హవానే నడుస్తుంది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్,డానియల్ శేఖర్ గా రానా నటించారు. ఇక భీమ్లా నాయక్ భార్యగా నిత్యా మేనన్ నటిస్తే… రానా భార్యగా సంయుక్తా మేనన్ నటించింది.
నిత్యా మేనన్ నటన ఎలా ఉంటుంది, ఆమె స్క్రీన్ అప్పీరెన్స్ ఎలా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకేనేమో ఈ సినిమాలో రానా భార్యగా చేసిన సంయుక్తా మేననే హైలెట్ అయ్యింది. ఈమె పాత్ర ద్వారానే ఈ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ అయినప్పటికీ.. తెలుగుకి వచ్చేసరికి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సరే ఇంతకీ ఈ సంయుక్తా మేనన్ ఎవరు.. ఈమెను ఎక్కడి నుండీ పట్టుకొచ్చారు అనే డిస్కషన్లు సోషల్ మీడియాలో చాలా జరుగుతున్నాయి.
ఈమె ఓ మలయాళీ నటి. ‘పాప్ కార్న్’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా విజయం సాధించడంతో ఈమెకు పాపులారిటీ పెరిగింది. అటు తర్వాత తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. అందుకే ఏరి కోరి ఈమెను ఎంపిక చేసుకున్నారు త్రివిక్రమ్ అండ్ టీం. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ చిన్న సినిమాలు నిర్మిస్తూ వచ్చినప్పటికీ.. మొదటి నుండీ పెద్ద క్యాస్టింగ్ ను మరీ ముఖ్యంగా పక్క భాషల్లో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న నటీనటులనే రంగంలోకి దింపుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘భీమ్లా’ తో సంయుక్తా మేనన్ ను రంగంలోకి దింపింది. ఈ సినిమాతో సంయుక్తా బాగా బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈమె కాల్ షీట్లు కోసం టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు.