ప్రపంచాన్ని చుట్టొచ్చే నాయకుడి కథను సినిమాగా తీయబోతున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli) ఇప్పుడు ఆ సినిమా కోసమే ప్రపంచాన్నిచుట్టేస్తున్నారు. అదేనండీ షూటంగ్ స్పాట్‌ల కోసం రెక్కీ నిర్వహిస్తున్నారు. రాజమౌళి అండ్ కో. ఇప్పుడు ఇదే పని మీద ఉంది. ఈ క్రమంలో కెన్యాలో షూటింగ్ స్పాట్‌ల గురించి సెర్చ్, రీసెర్చి జరుగుతోంది. ఈ క్రమంలో రాజమౌళి, కార్తికేయ (S. S. Karthikeya) కొన్ని ఫొటోలను షేర్ చేస్తున్నారు. అవి వైరల్ అవ్వడంతోపాటు కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలుస్తున్నాయి.
ప్రస్తుతం ఆఫ్రికన్ సఫారీలో ఉన్న రాజమౌళి.. అక్కడ అడవుల్లో రౌండ్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక సింహం ఫోటో ముందు రాజమౌళి నిలబడి ఉన్న స్టిల్ వైరల్‌గా మారింది. ఆ ఫొటో వైరల్ అవ్వడానికి ఆ సింహం వెనుక ఉన్న సెన్సేషనల్ స్టోరీ కూడా కారణం అని చెబుతున్నారు. ఆ సింహం పేరు చెబితే మీలో చాలామంది దాని కథను గుర్తుకు తెచ్చుకుంటారు కూడా. దీని పేరు బాబ్ జూనియర్.
బాబ్ జూనియర్ ప్రఖ్యాత సెరెంగెటి నేషనల్ పార్కులో ఏళ్ల తరబడి సందర్శకులకు గొప్ప అనుభూతి ఇచ్చింది. ఫొటో జెనిక్ ఫేస్ ఉన్న మృగరాజుగా బాబ్ జూనియర్‌కి పేరు. జమైకన్ గాయకుడు బాబ్ మార్లే స్మారకంగా ఈ షేర్‌కి ఆ పేరు పెట్టారు. ఓ రోజు అనుకోకుండా ఇతర సింహాల చేతుల్లో హత్యకు గురయ్యింది. ట్రైగ్వె అనే మరో సింహం కూడా అదే ఘటనలో చనిపోయింది. ఆ రోజుల్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.
రాజమౌళి తన ట్రాట్లింగ్ విజిట్‌తో భాగంగా ఆ సింహం ఫొటో ముందు ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ సింహం నేపథ్యంలో సినిమా తీస్తున్నారు అని అప్పుడు సగం వండిన కథనాలను సోషల్ మీడియా వార్చేసి, వడ్డించేస్తోంది. చూద్దాం రాజమౌళి ఇంకెన్ని ఫొటోలు షేర్ చేస్తారో. అప్పుడు ఇంకెన్ని కథనాలు ఇలాంటివి చక్కర్లు కొడతాయో. కానీ ఏమాటకు ఆ మాట ఫొటో అదిరిపోయింది.