తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సినిమాలు కొన్నాళ్ల నుండి తెలుగులో కూడా వరుసగా డబ్బింగ్ అవుతూ వస్తున్నాయి. ‘రెమో’ ‘డాక్టర్’ ‘డాన్’ వంటి సినిమాలు బాగా ఆడాయి. ‘మహావీరుడు’ని కూడా ఓటీటీలో బాగా చూశారు. ఇప్పుడు ‘అమరన్’ (Amaran) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan), R. మహేంద్రన్ (R Mahendran) సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు.
Amaran Review:
సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ కావడంతో హైప్ బాగా పెరిగింది. హీరో నితిన్ (Nithin) తండ్రి సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి…లు ఈ చిత్రాన్ని ‘శ్రేష్ట్ మూవీస్’ బ్యానర్ పై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన కొందరు పెద్దలు ఈ చిత్రాన్ని వీక్షించారు. తర్వాత వారి అభిప్రాయాన్ని తెలిపారు.
2014లో ఓ మిలిటెంట్ ఆపరేషన్ లో దేశ భద్రత కోసం ప్రాణాలు విడిచిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చాలా మందికి తెలియని ముకుంద్ ఫ్యామిలీ లైఫ్ ని ఇందులో చూపించారట. తమిళనాడుకు చెందిన ముకుంద్ కి ఈ సినిమా గొప్ప ట్రిబ్యూట్ అని అంతా అంటున్నారు. నిజమైన సూపర్ హీరోలు అంతా మిలిటరీలో ఉన్నారని, అలాంటి గొప్పవాళ్ళ జీవితాలని ఇలా తెరపై ఆవిష్కరించడం అనేది అభినందనీయం అని అంతా అంటున్నారు.
సినిమాలో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉందట. శివ కార్తికేయన్, సాయి పల్లవి తమ పాత్రల్లో ఒదిగిపోయారని, కమల్ హాసన్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని అంటున్నారు.దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన విధానం కూడా చాలా బాగుందట. మరి మొదటి షో పడ్డాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.