Allu Arjun: బన్నీ లక్కు మామూలుగా లేదుగా..!

పుష్ప సినిమాతో మొత్తానికి అల్లు అర్జున్ పాన్ ఇండియా రూట్ లో ఒక మంచి మార్కెట్ అయితే సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా మొత్తానికి మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు నిర్మాతలు కూడా చెబుతున్నారు. ఏదేమైనా కూడా అల్లు అర్జున్ తన స్థాయిని మరింత పెంచుకున్నాడు అనే చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో అతనికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. కరోనా సమయంలో పెద్ద సినిమాలను విడుదల చేయడం అంటే ఊపిరి బిగపట్టుకొని ఉండాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.

అసలైతే అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఫస్ట్ వేవ్ మొదలైన విషయం తెలిసిందే. కానీ అప్పటికే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. 200 కోట్ల కలెక్షన్స్ 2020లో అత్యధిక వసూళ్లను అందుకున్న తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. లాక్ డౌన్ పడినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఇంట్లోనే చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. ఇటీవల పుష్ప సినిమా కూడా చాలా అదృష్టవశాత్తు సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి.

సినిమా రిజల్ట్ ను పక్కన పెడితే అసలు ప్రస్తుతం ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో సినిమాను విడుదల చేసి చాలా పెద్ద రిస్క్ చేశారు. కానీ లక్కీగా పుష్ప ఉన్నప్పుడు ఎలాంటి ఆంక్షలు విదించలేదు. ఈ టైమ్ లో విడుదల చేసి ఉంటే మాత్రం చాలా ప్రభావం పడేది. మొత్తానికి ఒమిక్రాన్ వైరస్ పెరిగే కంటే ముందే పుష్ప సినిమా వచ్చి మంచిదయింది. కానీ మిగతా సినిమాలకు మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయింది. మొత్తానికి అల్లు అర్జున్ కరోనా సందిగ్దంలో మాత్రం చాలా అదృష్టంగా బయటపడ్డాడు అనే చెప్పాలి.

ఒక విధంగా అతన్ని ఐకాన్ స్టార్ అనడం కన్నా కూడా లక్కీ స్టార్ గా పిలవడం బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి వరకు ఓమిక్రాన్ తీవ్రత ఎంత వరకు ఉంటుందో తెలియదు. కానీ సినిమా బిజినెస్ పై మళ్ళీ ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus