సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను చదివారా… చదివి ఉంటే దానిని దృశ్య రూపం అక్టోబరు 8న థియేటర్లలో చూసి ఆనందించొచ్చు. ఒకవేళ చదవకపోయుంటే… అదే రోజు ఆ ఫీల్‌ను డైరెక్ట్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో నవలకు, సినిమాకు మధ్య ఉండే మార్పులు ఏంటో కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. అందుకే ఆ విషయాలను కాసేపు చూసుకుందాం. ‘కొండపొలం’ సినిమాను నల్లమల అటవీ ప్రాంతంలోనే తెరకెక్కించాలని ప్లాన్స్ వేసిందట చిత్రబృందం.
అయితే కరోనా, లాక్‌డౌన్ తదితర పరిస్థితులతో ప్లాన్స్ మార్చారట. అంతేకాదు నల్లమల అడవి.. టైగర్ జోన్ కావడంతో అనుమతులు క్లిష్టమయ్యాయట. దీంతో సినిమాను వేరే చోట చిత్రీకరించారు. రాయలసీమ మాండలికాన్ని నటీనటులకు నేర్పించారట. దీని కోసం వారందరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించారట క్రిష్. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్. నిజానికి ‘కొండపొలం’ నవలలో హీరోయిన్ అనే పాత్రే లేదు. సినిమా కోసం క్రిష్ ఆ ఆలోచన చేశారట.
సినిమా కోసం రచయిత సన్నపురెడ్డి వెంకటరామరెడ్డితో కలసి ఆ పాత్రను ప్రత్యేకంగా రాశారట. నవలలోని పుల్లయ్య అనే పాత్రకు మనవరాలిగా హీరోయిన్ పాత్రను రాసుకొచ్చారు. అలా హీరోయిన్ లేని సినిమాలోకి రకుల్‌ప్రీత్ సింగ్ వచ్చి చేరిందన్నమాట.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!