రమ్యకృష్ణ.. ఈ అందం గురించి చెప్పడానికి అప్పట్లో మాటలు చాలవు అని అనేవారు. కుర్రకారు ఆమె అందానికి, డ్యాన్స్‌కి కిర్రెత్తిపోయేవారు. అయితే వాళ్లే కాదు హీరోలు కూడా ఆమె అందానికి ఫ్యాన్స్ అయిపోయేవారు. ఈ మాటను చాలామంది నటులు గతంలో చెప్పారు. ఇప్పుడు రమ్యకృష్ణనే చెప్పింది. అందులో జగపతిబాబు కూడా ఉన్నారట. ఆయన ఇటీవల ఓ టీవీ/ ఓటీటీ షోతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఈ వారం గెస్ట్ రమ్యకృష్ణ. ఆ ప్రోమోలోనే ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో జగపతిబాబు చిలిపి చేష్టలు కొన్ని బయటికొచ్చాయి.. ఇంకొన్ని ఆయన చేసి చూపించారు కూడా.
దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెలక్ట్‌డ్ సినిమాలు చేస్తూ వస్తోంది. నీకు చిన్నప్పట్నుంచి చాలా మంది సైట్ కొట్టడం, ప్రేమించడం, పడి దొర్లడం లాంటివి జరిగాయి కదా అని జగపతిబాబు అంటుండగానే ‘నువ్వు కూడా’ అని రమ్యకృష్ణ అనేసింది. దాంతో జగపతిబాబు క్రష్ సంగతి కూడా తెలిసిపోయింది. అయితే జగపతిబాబుకు ఇలాంటి సరదాలు ఉన్నాయనేది మనకు తెలిసిందే. అయితే హీరోయిన్లకు కారులో లిఫ్ట్ ఇవ్వడం లాంటివి జగపతి బాగా చేస్తారని కూడా రమ్య చెప్పింది.
రమ్యకృష్ణ ఎర్లీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఏమంత సాఫ్ట్‌గా సాగలేదు. ఎన్నో డక్కామొక్కీలు తిని స్టార్ హీరోయిన్ అయింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా అదిరిపోయే పాత్రలు చేస్తోంది. అయితే ఆ రోజుల్లో రమ్య చాలా అల్లరి పిల్ల అని చెప్పేవారు. మరి ఈ షోలో అలాంటి అల్లర్లు ఎన్ని బయటకు వస్తాయో చూడాలి. ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే.. ‘జైలర్ 2’, అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా ఇంకే సినిమాలు ఆమె చేతిలో లేవని సమాచారం. రీసెంట్‌గా అయితే ‘గుంటూరు కారం’లో నటించింది.