Koratala Siva: కొరటాలకు షాకిచ్చిన టీవీ ఛానల్.. ఏం జరిగిందంటే?

కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆచార్య మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసి ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా నుంచి కాజల్ ను తొలగించడం జరిగింది. అయితే కాజల్ సినిమాలో కనిపించకపోవడంతో కొరటాల శివకు భారీ షాక్ తగిలిందని తెలుస్తోంది.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఆచార్య సినిమా సౌత్ భాషల హక్కులను భారీ మొత్తానికి తీసుకోగా ఆచార్య సినిమాలో కాజల్ ను తొలగించినందుకు రెండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన మొత్తంలో కట్ చేయడంతో పాటు తెలుగు మినహా ఇతర భాషల హక్కులు వద్దని చెబుతూ అందుకు సంబంధించిన ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా కట్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఈ విధంగా ఏడున్నర కోట్ల రూపాయల ఆదాయం తగ్గడం కొరటాల శివకు షాకేనని చెప్పవచ్చు.

ఆచార్య సినిమా బిజినెస్ వ్యవహారాలు కొరటాల శివ దగ్గరుండి చూసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆచార్య సీడెడ్ హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కొరటాల శివ ఆఫీస్ లో రచ్చరచ్చ చేశారు. కొరటాల శివ నుంచి వారికి 6 కోట్ల రూపాయలు అందిందని సమాచారం. ఆచార్య సీడెడ్ బయ్యర్లకు 15 కోట్ల రూపాయల నష్టం రాగా కొరటాల శివ 40 శాతం నష్టాలను భర్తీ చేయడంతో వాళ్లు శాంతించారని తెలుస్తోంది.

ఆచార్య సినిమా కొరటాల శివ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. కొరటాల శివ తర్వాత సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు కొరటాల శివకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఆచార్య సినిమా ఫ్లాపైనా కొరటాల శివపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus