నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాల్లో నటించి సూపర్ డూపర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు.. ‘కళాభినేత్రి’ వాణిశ్రీతో ఆయన జోడీ ప్రేక్షకాభిమానులకు అభిమాన జంట.. ఆ కోవలో.. తనకు ‘బంగారు బుల్లోడు’ వంటి ట్రెమండస్ ఫిలిం ఇచ్చిన దర్శక నిర్మాత వి.బి రాజేంద్ర ప్రసాద్ (జగపతి బాబు తండ్రి) తో కలిసి పలు చిత్రాలు చేసిన ఏఎన్నార్ అదే బ్యానర్‌లో నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘బంగారు బాబు’.. వాణిశ్రీ కథానాయిక..
జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థలో వి.బి రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ అపురూప చిత్రం ఆబాలగోపాలాన్నీ అలరించడమే కాక బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.. 1973 మార్చి 15న విడుదలైన ‘బంగారు బాబు’ 2023 మార్చి 15 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. ఇంకో విశేషం ఏంటంటే.. శివాజీ గణేశన్, శోభన్ బాబు, రాజేష్ ఖన్నా, సూపర్ స్టార్ కృష్ణ ఈ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు..
‘విశ్వ నట చక్రవర్తి’ ఎస్వీ రంగారావు, జగ్గయ్య, గుమ్మడి, జయంతి, నాగ భూషణం, రమణా రెడ్డి, పద్మనాభం, రాజబాబు, రమాప్రభ, సూర్యకాంతం వంటి భారీ తారాగణమంతా నటించగా.. కె.వి. మహదేవన్ సంగీతం, ఆచార్య ఆత్రేయ మాటలు – పాటలు, ఘంటసాల, పి. సుశీల గానం, ఎస్. వెకంట రత్నం కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు.. పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్.. తెలుగు, తమిళ్, హిందీ సూపర్ స్టార్స్‌తో పాటు కైకాల అతిథి పాత్రల్లో కనిపించారు..
కథ రీత్యా ఆ పాత్రలు వస్తాయి.. వారిని తెరపై చూడడం జనాలకు బోనస్ అనే చెప్పాలి.. రైల్వే స్టేషన్ మాస్టర్‌గా అక్కినేని, సినీ కథానాయికగా వాణిశ్రీ కనిపించి అలరించారు.. కథలోని ట్విస్టులు, క్యారెక్టర్లు, పాటలు ప్రేక్షకాభిమానులకు బాగా కనెక్ట్ అయ్యాయి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది ‘బంగారు బాబు’..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్