బాలీవుడ్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లెక్కే వేరు. సగటు కమర్షియల్ హీరోయిన్‌లా సినిమాలు చేస్తుంటుంది కానీ… ఇవే సినిమాలు చేయాలని ఎక్కడా గిరి గీసుకోదు. హీరోయిన్ పాత్రలకు సై అంటుంది, ఐటెమ్ సాంగ్స్‌కి సైసై అంటుంది. అందుకే బాలీవుడ్ జాకీ… అంటే అందరికీ ఇష్టం. ఆమె గురించి చాలామంది చాలా విషయాలు తెలుసు. కానీ ఈ రోజు ఆమె జన్మదినం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం…
* జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మన దేశస్థురాలు కాదు అని అందరికీ తెలిసిన విషయమే. ఆమె శ్రీలంకకు చెందిన ముద్దుగుమ్మ. అయితే ఇక్కడో పాయింట్ ఉంది. ఆమె తండ్రి శ్రీలంకకు చెందినవారు. మాతృమూర్తి మలేసియాకు చెందినవారు. ఆమె పూర్వీకులు కెనడాకు చెందినవారు కావడం గమనార్హం.
* జాక్వెలిన్లో మూడు దేశాలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. అంటే కెనడా, శ్రీలంక, మలేసియాకు చెందిన జాక్వెలిన్ పెరగిందంతా బహ్రెయిన్‌లోనట.
* జాక్వెలిన్‌కు ఒక అక్క, ఇద్దరు అన్నలు ఉన్నారు. అంటే మన జాకీ వాళ్లింట్లో ఆఖరి ముద్దుల కూతురు అన్నమాట.
* బహ్రెయిన్‌లో ఉన్నప్పుడు జాక్వెలిన్ స్ట్రీట్ రేసింగ్‌లో పాల్గొనేదట. అమ్మాయిలు మాత్రమే పాల్గొనే రేసులో జాకీ చాలాసార్లు గెలిచిందట. అంటే ఆమె మీద అలాంటి కథ రాయొచ్చు.. అలాంటి ఆలోచన ఎవరు చేస్తారో
* జాక్వెలిన్ సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత శ్రీలంకలో టెలివిజన్ రిపోర్టర్‌గా పని చేసింది కూడా. ఆ తర్వాత మోడలింగ్ వైపు వచ్చేసింది.
* జాక్వెలిన్‌కు స్పానిష్ లాంగ్వేజ్ వచ్చు. అలాంటి ఫ్రెంచ్, అరబిక్ భాషల్లోనూ ప్రవేశం ఉంది. భాషను అభివృద్ధి చేసుకోవడానికి ఆమె బెర్లిట్జ్ స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో చేరింది.
* డ్యాన్స్ అంటే ఈ శ్రీలంక అందానికి చాలా ఇష్టం. దానిని ఆమెను వర్కౌట్‌లా భావిస్తుందట. ఆమె జాజ్ బేలట్ డ్యాన్స్‌లో శిక్షణ కూడా తీసుకుంది.
* జాక్వెలిన్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ చూస్తే గుర్రంతో చాలా ఫొటోలు కనిపిస్తాయి.
* జంతువులంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. అందుకుగాను ఆమెను ‘వుమన్ ఆఫ్ ది ఇయర్’గా 2014లో పెటా గుర్తించింది.
* 2008, 2011లో ప్రచురించిన ‘వరల్డ్ సెక్సీయెస్ట్ ఉమెన్’ జాబితాలో జాక్వెలిన్ 12వ స్థానంలో నిలిచింది. 2013 మోస్ట్ డిజైరబుల్ ఉమన్ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది.
* 2014లో వెలువరించిన టాప్ 100 ఫోర్బ్స్ సెలబ్రిటీ జాబితాలో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. ఆదాయం, పాపులారిటీ ప్రకారం ఈ జాబితా ప్రకటిస్తుంటారు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!