Rajisha Vijayan: జై భీమ్ లో అద్భుతంగా నటించిన ఈమె ఎవరో తెలుసా?
- November 6, 2021 / 11:49 AM ISTByFilmy Focus
జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలకు ఓటు వేస్తూ సూర్య తన నటనతో, పాత్రల ద్వారా మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూర్య నటించి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన జై భీమ్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. కోర్టు డ్రామాగా తెరకెక్కిన జై భీమ్ సినిమాలో సూర్యకు జోడీగా రాజిష విజయన్ అద్భుతంగా నటించారు. రాజిష విజయన్ గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత కొంతకాలం టీవీ యాంకర్ గా పని చేశారు.
ఆ తర్వాత రాజిష విజయన్ కు సినిమా ఆఫర్లు రాగా తమిళ, మలయాళ సినిమాల్లో ఈమె నటించారు. అనురాగ కరిక్కిన్ వెల్లం అనే మలయాళ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజిష విజయన్ తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా తెలుగులో తెరకెక్కుతోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రాజిష విజయన్ హీరోయిన్ కావడం గమనార్హం. రాజిష విజయన్ తల్లి పేరు షీలా కాగా తండ్రి పేరు విజయన్. రాజిష విజయన్ కు ఒక చెల్లి ఉండగా రాజిష తండ్రి ఆర్మీలో పని చేయడం గమనార్హం.

జై భీమ్ సక్సెస్ తర్వాత రాజిష విజయన్ కు సినిమా ఆఫర్లు పెరిగాయని తెలుస్తోంది. తొలి సినిమాతోనే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్న రాజిష విజయన్ కోలీవుడ్ లో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ చేసిన రాజిష విజయన్ తమిళంలో నటిగా రాణిస్తున్నారు.
వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!












