Annamayya: ఆ రీజన్ వల్లే బాలయ్య అన్నమయ్యలో నటించలేదా?

సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచారనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాలకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండేది. బాలయ్య నాగార్జున కలిసి ఏదైనా సినిమాలో నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. అయితే నాగార్జున సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాల జాబితాలో అన్నమయ్య సినిమా ముందువరసలో ఉంటుంది.

రాఘవేంద్రరావు డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా భక్తిరస చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం మెప్పించిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటించారు. అయితే ఈ పాత్ర కోసం దర్శకులు పరిశీలించిన హీరోల జాబితాలో శోభన్ బాబు, బాలకృష్ణ ఉన్నారు. మొదట ఈ సినిమా మేకర్స్ శోభన్ బాబును సంప్రదించగా ఆయన ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడంతో వద్దని అనుకున్నారు.

ఆ తర్వాత బాలకృష్ణను సంప్రదించాలని భావించినా ఫ్యాన్స్ నుంచి సమస్యలు వస్తాయని భావించి మేకర్స్ ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గారు. ఒకవేళ బాలయ్య ఆ సినిమాలో నటించి ఉంటే మాత్రం అన్నమయ్య సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. గుండమ్మ కథ రీమేక్ లో కూడా బాలయ్య నాగార్జున కలిసి నటిస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించినా ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు.

బాలయ్య నాగార్జున మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ ప్రచారంలో నిజం లేదని నాగ్, బాలయ్య బహిరంగంగా వెల్లడించారు. ప్రస్తుతం వరుస విజయాలతో నాగార్జున, బాలకృష్ణ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ హీరోల గత సినిమాలు అఖండ, బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus