స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయాలలో సక్సెస్ కావడం కొరకు రేయింబవళ్లు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా హరిహర వీరమల్లు సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఏపీ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ నెల నుంచి పెద్ద సినిమాలకు టికెట్ రేట్లను తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెద్ద సినిమాలకు ఏపీలో నష్టాలు తప్పడం లేదు. పెద్ద సినిమాల హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీ మొత్తంలో నష్టాలు తప్పడం లేదు. అయితే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ టికెట్ రేట్ల గురించి చేసిన వ్యాఖ్యల వల్ల జగన్ సర్కార్ కు ఆగ్రహం కలిగినట్టు ప్రచారం జరిగింది.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రిపబ్లిక్ సినిమా రిజల్ట్ పై కూడా ప్రభావం చూపాయని కామెంట్లు వినిపించాయి. అయితే పవన్ స్పీచ్ లో టికెట్ రేట్ల గురించి మాట్లాడతాడని దేవ్ కట్టాకు ముందే తెలుసని దేవ్ కట్టా అనుమతితోనే పవన్ ఆ విధంగా మాట్లాడారని తెలుస్తోంది. పవన్ దర్శకుడి అనుమతితోనే మాట్లాడటాన్ని పవన్ ఫ్యాన్స్ సైతం మెచ్చుకుంటున్నారు. అయితే పవన్ స్పీచ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది పవన్ కళ్యాణ్ స్పీచ్ ను సమర్థిస్తే మరి కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ స్పీచ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అయితే పవన్ మాత్రం తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. మరోవైపు భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో ఏపీ సర్కార్ ఏ విధంగా వ్యవహరించనుందో చూడాల్సి ఉంది. భీమ్లా నాయక్ 120 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా ఓటీటీ ఆఫర్లు వచ్చినా మేకర్స్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపారు.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!