Prabhas: ఆ వార్త వల్ల నిరాశపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రస్తుతం మన దేశంతో పాటు విదేశాల్లో కూడా క్రేజ్ ఉంది. ప్రభాస్ సినిమా విడుదలైతే టాక్ తో సంబంధం లేకుండా సులువుగా 300 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈ ఏడాది ఆగష్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆగష్టునాటికి కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఆదిపురుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ మూవీ 10,000 థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రచారం జరగగా ఆదిపురుష్ ఆ సినిమాకు రెట్టింపు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని జరిగిన ప్రచారం వల్ల అభిమానులు చాలా సంతోషించారు. అయితే ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని సమాచారం. ఆదిపురుష్ యూనిట్ ఈ వార్త గురించి స్పందించి వివరణ ఇచ్చింది.

వైరల్ అవుతున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని ఆదిపురుష్ యూనిట్ తెలిపింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా గ్రాఫిక్స్ కు సంబంధించిన పనులు జోరుగా జరుగుతున్నాయి. అయితే 20,000 థియేటర్లలో రిలీజ్ కాకపోయినా దేశ భాషలతో పాటు ఇంగ్లీష్ లో ఈ సినిమాను డబ్ చేయనున్నారని సమాచారం.

చైనాతో పాటు ఇతర దేశాల్లో ఈ సినిమా పెద్దఎత్తున రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్ లో ఆదిపురుష్ ప్రత్యేక సినిమాగా నిలుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారు. ప్రభాస్ కృతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఆదిపురుష్ కావడం గమనార్హం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ మార్చి నెలలో విడుదల కానుందని తెలుస్తోంది. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ క్రేజ్ ను మరింత పెంచుతాయేమో చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus