టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల ప్రేమకథల సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటుంటారు. అంతలా తమ సినిమాలతో అలరించారు. అలాంటి సినిమాల్లో ‘ప్రేమించుకుందాం రా’, ‘రావోయి చందమామ’ లాంటివి కూడా ఉన్నాయి. ప్రేమకథకు, చక్కటి కుటుంబ కథలను జోడించి ఆ సినిమాలను సిద్ధం చేశారు. ఈ సినిమాల దర్శకుడు జయంత్ సి. పరాన్జీ వాటిని చాలా చక్కగా తెరకెక్కించారు అని చెప్పాలి. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ల విషయంలో ఓ కామన్ విషయం జరిగిందట.
ఓ సందర్భంలో జయంత్ ఆ విషయాలు చెప్పుకొచ్చారు. వెంకటేశ్ కథానాయకుడిగా, అంజలా ఝవేరి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. ఈ సినిమా వచ్చి 26 ఏళ్లు అయిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాలో సీన్స్, పాటలు చాలా ఫ్రెష్‌గా, రిఫ్రెష్‌గా ఉంటాయి. అంజలా ఝవేరి లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ అయితే కిర్రాక్ అని చెప్పొచ్చు. అయితే ఆ స్థానంలో మనం ఐశ్వర్య రాయ్‌ను మిస్ అయ్యాం. అవును అంజలా ఝవేరి కంటే ముందు ఆ పాత్ర కోసం ఐశ్వర్యను అనుకున్నారట.
అయితే అప్పటికే ఆమె చేసిన రెండు సినిమాలు (Movies) ఫ్లాప్ అవ్వడంతో అంజలాను తీసుకున్నారట. అయితే, నాగార్జున – జయంత్ సి. పరాన్జీ కాంబినేషన్‌లో వచ్చిన ‘రావోయి చందమామ’ సినిమాలో ఐశ్వర్య రాయ్ ప్రత్యేక గీతంలో నటించింది. అయితే దీని వెనుక కూడా పెద్ద కథే జరిగిందట. ప్రీతి జింతాను పాట గురించి అడగటానికి వెళ్లినప్పుడు జయంత్ అనుకోకుండా ఐశ్వర్యా రాయ్‌ను కలిశారట. ‘రావోయి చందమామ’ విషయం ఐశ్వర్యకు తెలియడంతో ‘మీ సినిమాలో నటించమని అందర్నీ అడుగుతారు.
నన్ను ఎందుకు అడగరు’ అని అందట. దీంతో ఆ పాటను ఆమె నర్తించమని అడిగారట. అలా ఐశ్వర్య తెలుగులో నటించిన ఏకైక చిత్రంగా ‘రావోయి చందమామ’ సినిమా నిలిచి పోయింది. ఆ తర్వాత ఐశ్వర్య నేరుగా మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’లో నందినిగా నటించి మెప్పించింది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?