సాధారణంగా రాజమౌళి తన డైరెక్షన్ లో నటించే హీరోలు అదే సమయంలో మరో సినిమాలో నటించడానికి అస్సలు అంగీకరించరు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ ఆలస్యమైనా హీరో మాత్రం మరో సినిమా షూటింగ్ లో పాల్గొనకూడదు. ఈ నిబంధనల వల్లే ప్రభాస్ బాహుబలి, బాహుబలి2 సినిమాలకు ఐదేళ్లు పరిమితం కాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు మూడున్నరేళ్లు పరిమితం కావాల్సి వచ్చింది. అయితే చరణ్ మాత్రం ఒకవైపు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూనే మరోవైపు ఆచార్య సినిమాలో నటించారు.
ఈ రెండు సినిమాలు థియేటర్లలో కేవలం నెల రోజుల గ్యాప్ లో విడుదలవుతున్నాయి. అయితే ఆచార్యలో నటిస్తానని రాజమౌళిని అడగటానికి తాను భయపడ్డానని చరణ్ వెల్లడించారు. రాజమౌళిని సంప్రదించడానికి నేను కూడా భయపడ్డానని కొరటాల శివ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమకు సాయం కావాలని చరణ్, కొరటాల శివ చిరంజీవి సాయం కోరామని తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి వెళ్లి జక్కన్నను అడిగి ఆచార్య విషయంలో ఒప్పించారు. ఆ విధంగా ఈ సినిమాలోకి చరణ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
అమ్మకు నాన్న, నేను ఒకే స్క్రీన్ పై కనిపించాలని కోరిక అని అమ్మ కోరిక బలమైన కోరిక కాబట్టే నెరవేరిందని రామ్ చరణ్ కామెంట్లు చేశారు. ఆ తర్వాత జక్కన్న డేట్లు కేటాయించగా ఆచార్య షూట్ లో పాల్గొన్నానని చరణ్ చెప్పుకొచ్చారు. ఆచార్య మూవీ ప్రమోషన్స్ విషయంలో వేగం పెరిగింది. ఆచార్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వరుస విజయాలు అందుకున్న కొరటాల శివ ఆచార్య సినిమాతో ఐదో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఆచార్య ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.