Prabhas: కళ్లు చెదిరే బడ్జెట్ తో సలార్ తెరకెక్కుతోందా?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో లీక్ కాగా లీకైన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ సలార్ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కళ్లు చెదిరే బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఒక స్టార్ హీరో సినిమాకు అయ్యే బడ్జెట్ ను ఈ సినిమాలో ఒక సీక్వెన్స్ కోసం ఖర్చు చేస్తున్నారు.

మరోవైపు సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా ప్రశాంత్ నీల్ ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పారని బోగట్టా. సలార్ సినిమాలో క్లైమాక్స్ సీన్ కొరకు మేకర్స్ 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా ఎమోషన్స్ తో కూడిన హై వోల్టేజ్ యాక్షన్ సీన్ గా ఈ సీన్ ఉంటుందని తెలుస్తోంది. విమానాలు, మిషిన్ గన్ లు, మిలిటరీ ట్యాంకులను ఈ యాక్షన్ సీన్ కొరకు వాడారని సమాచారం.

సలార్ సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలు సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఈ సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ నుంచి అభిమానులు ఎలాంటి సినిమాను ఆశిస్తారో సలార్ అలా ఉండబోతుందని సమాచారం. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారని తెలుస్తోంది. హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా డబ్ కానుంది. తెలుగు, కన్నడ భాషలలో మాత్రం ఈ సినిమాను ఒకే సమయంలో షూట్ చేస్తున్నారు.

బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో ప్రభాస్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. తెలుగుతో సమానంగా బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలకు బిజినెస్ జరుగుతోంది. 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సలార్ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus