Tollywood Movies: టాలీవుడ్ సినిమాలు కొత్త రికార్డులు సృష్టిస్తాయా?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు బ్లాక్ బస్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్నా కలెక్షన్లు మాత్రం నిర్మాతలు ఆశించిన స్థాయిలో రాలేదనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు నిర్మాతలకు ఎక్కువ మొత్తంలో లాభాలను ఇవ్వడం లేదు. అయితే నవంబర్ లోనైనా టాలీవుడ్ ఇండస్ట్రీ కళకళలాడుతుందని నిర్మాతలు భావిస్తుండటం గమనార్హం. నవంబర్ లో భారీ అంచనాలతో రజినీకాంత్ నటించిన పెద్దన్న సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో రజినీకాంత్ కు జోడీగా నయనతార నటిస్తుండగా చెల్లిలి రోల్ లో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. మారుతి డైరెక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి సినిమా కూడా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. కేవలం 30 రోజుల్లో షూటింగ్ పూర్తైన మంచి రోజులు వచ్చాయి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

నవంబర్ నెల 12వ తేదీన కార్తికేయ నటించిన రాజా విక్రమార్క, నాగశౌర్య లక్ష్య సినిమాలు రిలీజ్ కానున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో లక్ష్య తెరకెక్కగా ఏజెంట్ బ్యాక్ డ్రాప్ లో రాజా విక్రమార్క తెరకెక్కింది. ఈ సినిమాలతో పాటు చిన్న సినిమాలైన గుడ్ లఖ్ సఖి, స్కై ల్యాబ్స్, రామ్ అసుర్, రౌడీ బాయ్స్ నవంబర్ లో థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. నవంబర్ లో రిలీజ్ కానున్న సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అవుతాయని టాలీవుడ్ ఆశలు పెట్టుకోగా ఆ ఆశలు నెరవెరతాయో లేదో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus