Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

  • June 17, 2022 / 12:07 AM IST

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నా ప్రభాస్ అభిమానులు మాత్రం సలార్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాన్స్ అంచనాలను మించి విజయం సాధించడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్నిరోజుల క్రితం వరకు కొంచెం బొద్దుగా కనిపించిన ప్రభాస్ ప్రస్తుతం స్లిమ్ లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సలార్ సినిమా కోసమే ప్రభాస్ లుక్ ను మార్చుకున్నారని తెలుస్తోంది

సలార్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ఒక పాత్రకు సంబంధించిన షూట్ ఇప్పటికే పూర్తి కాగా మరో పాత్రకు సంబంధించిన షూట్ కోసమే ప్రభాస్ లుక్ ను మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రశాంత్ నీల్ లేదా ప్రభాస్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తున్నారు.

శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ రోల్ లో కనిపిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపుగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. కేజీఎఫ్ ఛాప్టర్2 సక్సెస్ సాధించిన నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ ఖాతాలో ఆ స్థాయి హిట్ చేరలేదు.

సలార్ సినిమాతో ఆ లోటు భర్తీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రభాస్ తర్వాత సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లు పూర్తయ్యే వరకు ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరని బోగట్టా.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus