‘‘నేను నమ్మే సిద్ధాంతమొకటే.. మనం పది మందిని బాగు చేయకపోయినా పర్లేదు కానీ, ఒక్కరిని కూడా చెడకొట్టకూడదు. నా చిత్రాలన్నీ దీనికి తగ్గట్లుగానే ఉండాలనుకుంటా’’ అంటున్నారు యువ దర్శకురాలు లక్ష్మీసౌజన్య. ‘వరుడు కావలెను’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఆమె… గురించి ఇప్పుడిప్పుడే చాలామంది గూగుల్ చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారు, ఎవరి దగ్గర శిష్యరికం చేశారు అని ఆరా తీస్తున్నారు. ఆ వివరాలన్నీ మీ కోసం. లక్ష్మీసౌజన్య పుట్టింది కర్నూలు జిల్లాలోని వెంకటాపురం.
అయితే పెరిగిందంతా గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో. ఆమె నాన్న మ్యాథ్స్ లెక్చరర్. 11ఏళ్లకే పదో తరగతి పరీక్షలు రాశారట లక్ష్మీసౌజన్య. చిన్నతంలో ఆటలు బాగా ఆడేవారట. అందుకే వాళ్ల నాన్న ఆమెను ప్లేయర్‌గా చూడాలనుకునేవారట. అయితే ఆమెకు మాత్రం సినిమాల్లోకి రావాలని ఉండేది. ఆ ఆసక్తితోనే 18ఏళ్ల వయసులోనే హైదరాబాద్ వచ్చేశారు. లక్ష్మీసౌజన్య చేసిన ఓ ప్రకటన చూసి… ప్రముఖ దర్శకుడు తేజ ఆమెకు సహాయ దర్శకురాలిగా అవకాశమిచ్చారట.
ఆ తర్వాత శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, క్రిష్ లాంటి ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేశారు. ఓ వైపు సహాయ దర్శకురాలిగా పని చేస్తూనే వాణిజ్య ప్రకటనలు కూడా రూపొందించారట. వివాహం గురించి ఈ సినిమా చేస్తున్న లక్ష్మీ సౌజన్య… ఆ తర్వాత ఆధార్ కార్డు నేపథ్యంలో సినిమా సిద్ధం చేస్తున్నారట.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?