Arya3 Movie: ఆ పాత్రలో నటించడం బన్నీకి ఇష్టం లేదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్1 లో నటిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని గతంలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కగా ఆర్య3 మూవీ మాత్రం విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. స్టార్ హీరో బన్నీ ప్రస్తుతం ప్రేమకథలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఆ రీజన్ వల్లే సుకుమార్ ఆర్య3 సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు యూత్ లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆర్య3లో విజయ్ నటిస్తే బన్నీ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బన్నీకి ఆర్య సినిమాతో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు దక్కిందనే సంగతి తెలిసిందే.

ఆర్య2 కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా బన్నీకి నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టింది. త్వరలో ఆర్య3 సినిమాకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తుండగా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. విజయ్ దేవరకొండ కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus