Vaishnav Tej: ఖుషి మూవీకి వైష్ణవ్ మూవీకి మధ్య లింక్ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని సినిమాలలో ఖుషి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు యూత్ లో పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచింది. ఎస్.జె సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం. అయితే ఖుషి తరహా కథాంశం ఉన్న సినిమాలలో ఆ తర్వాత కాలంలో మెగా హీరోలెవరూ నటించలేదు.

Click Here To Watch NOW

ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఓవర్ నైట్ లో పాపులర్ అయిన వైష్ణవ్ తేజ్ భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తొలి సినిమాతోనే కనీవిని ఎరుగని స్థాయిలో రికార్డులను సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ ను రెండో సినిమా కొండపొలం ఫలితం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

అయితే వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం గిరీశయ్య డైరెక్షన్ లో రంగరంగ వైభవంగా అనే మూవీలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా జులై 1వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఖుషి సినిమాలోని ఒక సీన్ లాంటి సీన్ ఉంటుందని ఆ సీన్ లో వైష్ణవ్ పవన్ కళ్యాణ్ లా అద్భుతంగా నటించాడని తెలుస్తోంది.

హీరోహీరోయిన్ల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ కు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని బోగట్టా. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో వైష్ణవ్ ఉప్పెన సినిమాను మించిన విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మూడు నెలల తర్వాత రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus