Bigg Boss 5 Telugu: లోగోలో ‘మేజ్‌’ ఎందుకొచ్చిందబ్బా!

తెలుగు బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ ఎప్పుడూ అంటూ చాలా రోజుల నుండి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే లాంచ్‌ తేదీ ప్రకటించలేదు కానీ… పనులు మొదలయ్యాయని చెబుతూ బిగ్‌బాస్‌ బృందం ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. బ్రాండ్‌ న్యూ లోగో, కొత్త బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో లోగో అయితే ఆదిరిపోయింది. అయితే ఆ లోగోలో గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. మాకు తెలిసి ఇప్పటికే మీరు చూసి ఉంటారు.

బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ అంటే బిగ్‌బాస్‌ 5కు సంబంధించి సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో Checkout the aMAZEing first look of BiggBossTelugu5 logo అని రాశారు. అందులో MAZEని హైలైట్‌ చేశారు. లోగోలో చూసినా మేజ్‌ కనిపిస్తోంది. మామూలుగా మేజ్‌ అంటేనే కన్‌ఫ్యూజన్‌. అందులోనూ బిగ్‌బాస్‌ లాంటి ప్రోగ్రామ్‌లో కన్‌ఫ్యూజ్‌ అంటే మామూలుగా ఉండదు. లోగోలు, బిగ్‌బాస్‌ టీమ్‌ నుండి వస్తున్న పుకార్లు, వార్తల ప్రకారం చూస్తే… ఈసారి బిగ్‌బాస్‌ మామూలుగా ఉండదు అని అంటున్నారు.

ఇప్పటివరకు వచ్చిన సీజన్లతో పోలిస్తే ఈసారి డబుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ విత్‌ ట్విస్ట్‌లు పక్కా అని చెబుతున్నారు. గత సీజన్‌లో క్యూరియాసిటీ పాళ్లు తగ్గాయని నెటిజన్లు నుండి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో కన్‌ఫ్యూజన్‌ డ్రామాను యాడ్‌ చేస్తున్నారని సమాచారం.


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus