Nadiya: టాలీవుడ్‌ ‘అత్త’ కుటుంబం గురించి తెలుసా?

టాలీవుడ్‌లో క్లాస్‌ తల్లి పాత్రలన్నా, అత్త పాత్రలన్నా ఠక్కున గుర్తొచ్చే నటీమణుల్లో నదియా మొదటి వరుసలో ఉంటారు. నేటి స్టార్‌ హీరోలకు అత్త, తల్లి పాత్రలకు ఆమెనే ఎంచుకుంటున్నారు దర్శకులు. స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లిపోయారు నదియా. ఆ తర్వాత తిరిగి ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’ తమిళ రీమేక్‌ ‘ఎం కుమరన్‌ సన్నాఫ్‌ మహాలక్ష్మి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆమె గురించి ఈ విషయాలు అందరికీ తెలుసు. చాలామందికి తెలియని కొన్ని విషయాలు మీ కోసం.

నదియా అసలు పేరు జరీనా మొయిదు. ఆమె సినిమాల్లోకి వచ్చేటప్పటికి హిందీ నటి జరీనా వహాబ్‌ ఉన్నారు. ఆమె అప్పటికే చాలా ఫేమస్‌ కావడంతో.. జరీనా మొయిదు అనే పేరు కాకుండా వేరే పేరు పెడదాం అని ఆమె తొలి సినిమా ‘నొక్కెత దూరతు కన్నుమ్‌ నాట్టు’ దర్శకుడు ఫాజిల్‌ అనుకున్నారట. అలా ‘గలగల పారే నది’ అని అర్థం వచ్చేలా ‘నదియా’ అనే పేరు పెట్టారట. సినీ రంగంలో కూడా ఎక్కడా ఆగకుండా నదిలా పరవళ్లు తొక్కుతూ ముందుకెళ్లాలని ఫాజిల్‌ ఆశించారు.

అందుకేనేమో ఎన్ని మలుపులున్నప్పటికీ ఈ రంగంలోనే ఇప్పటికీ కొనసాగుతున్నా అని చెబుతుంటారు నదియా. నదియాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పేరు సనమ్‌ వెస్ట్రన్‌ మ్యూజిక్‌ సింగర్‌. చాలా సంగీత నాటకాల్లో పాల్గొంది కూడా. , చిన్న అమ్మాయి పేరు జానాకి డ్యాన్స్‌ ఇష్టమట. హిప్‌ హాప్‌, జాజ్‌ లాంటివి చేస్తుందట. అయితే అవి ఇష్టాలు మత్రమే. అలా అని చదువులో ఏ మాత్రం తక్కువ కాదట. ఇద్దరికీ చదువంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పారు నదియా.

నదియా మంచి ఫుడీ. నోటికి నచ్చిన ఆహారాన్ని ఓ పట్టుపట్టేస్తారట. అయితే అంత తిన్నా బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి వ్యాయామం చేస్తారట. వాకింగ్‌, వెయిట్‌ ట్రైనింగ్‌, యోగా లాంటివి రోజూ చేస్తారట. ఇప్పటివరకు ఎన్నో సినిమాల, హిట్‌ చిత్రాలు చేసిన నదియా… తన సినిమాల్ని చూసుకోరట. అయితే వేరే నటులు చేసి సినిమాల్ని ఓపిగ్గా థియేటర్‌కి వెళ్లి మరీ చూస్తారట. ఇంట్రెస్టింగ్‌ కదా.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus