Jr NTR: ఆ టైటిల్స్ కు తారక్ దూరంగా ఉంటే బెటర్!

చిన్న వయస్సులోనే స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు తారక్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. వరుస ఫ్లాపులు వచ్చిన ప్రతి సందర్భంలో భారీ హిట్ తో తారక్ విమర్శలకు చెక్ పెట్టారు. 29 సినిమాలలో నటించిన తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో 30వ సినిమాలో నటిస్తున్నారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా దర్శకులకు అవకాశాలను ఇస్తూ తారక్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే ఇన్నేళ్ల తారక్ సినీ కెరీర్ ను పరిశీలిస్తే న అక్షరంతో ఎన్టీఆర్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు.

Click Here To Watch NOW

తారక్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన తర్వాత నటించిన తొలి సినిమా నిన్ను చూడాలని బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత తారక్ నాగ, నా అల్లుడు, నరసింహుడు పేర్లతో తెరకెక్కిన సినిమాలలో తారక్ నటించారు. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. కానీ నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ కు ఈ సినిమా భారీస్థాయిలో లాభాలను మాత్రం అందించలేదు.

ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులలో ఏ సినిమాకు కూడా న అక్షరం పేరుతో టైటిల్ పెట్టవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ సైతం ఈ విషయంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూన్ నెల నుంచి ఎన్టీఆర్ తర్వాత మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తారక్ ఈ సినిమా కొరకు ఏకంగా 55 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

కొరటాల శివ గత సినిమాలకు భిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. కొరటాల స్నేహితుడు సుధాకర్, కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus