‘గేమ్ ఛేంజర్’ (Game Changer) పోస్టర్ల విషయంలో, ప్రచారం విషయంలో రామ్‌చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ గతకొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సినిమా విడుదల విషయంలో ఇప్పటికే హర్ట్ అయి ఉన్న ఫ్యాన్స్.. ప్రచార సామాగ్రి సరిగా లేకపోవడంతో నిరాశ చెందారు. అలాంటి సమయంలో అనూహ్యంగా టీమ్ నుండి రెండు కొత్త పోస్టర్లు వచ్చాయి. వాటితో ఫ్యాన్స్‌కి పూనకాలు షురూ అయ్యాయి. ఇలా హైలోకి ఫ్యాన్స్ రావడానికి ఓ కారణం తమన్ చేసిన ట్వీట్ కూడా.
‘గేమ్ ఛేంజర్’ సినిమా టీమ్ ఇటీవల ఓ పోస్టర్‌ను లాంచ్ చేసింది. రైల్వే ట్రాక్ మీద కొంతమంది కుర్రాళ్లు పడుకొని ఉంటారు. వారి ముందు రామ్‌చరణ్ ఓ బాక్స్ వేసుకొని కూర్చుని ఉంటాడు. ఆ పోస్టర్ చూసి మాస్ ఎలిమెంట్స్ నచ్చి మెచ్చుకున్న ఫ్యాన్స్.. ఆ తర్వాత కాసేపటి సినిమా సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) వేసిన ట్వీట్ చూసి ఇంకాస్త హైప్ ఎక్కిపోయారు. దానికి కారణం ఆ పోస్టర్ ఓ హై ఆక్టేన్ ట్రైన్ ఫైట్ తర్వాత అని తెలియడమే.
శంకర్ (Shankar) సినిమాల్లో భారీ యాక్షన్ సీన్స్ పక్కాగా ఉంటాయి. ఎంత భారీగా ఉంటాయి అంటే రూ.20 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి కూడా ఆయన వెనుకాడరు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోనూ అదే చేశారని తెలుస్తోంది. సినిమాలో ఓ ట్రైన్ – హెలీకాప్టర్ ఛేజ్ ఉందట. హీరో తన ఫ్యామిలీతో ట్రైన్‌లో వెళ్తుంటే, విలన్ గ్యాంగ్ హెలీకాఫ్టర్‌లో ఛేజ్ చేస్తుందట. వాళ్లని చరణ్ రఫ్ఫాడించి, అదే హెలీకాఫ్టర్‌లో గమ్యం చేరుకుంటాడట.
అంతేకాదు సినిమాలో రామ్‌చరణ్ ఫస్ట్ సీన్ కూడా అదే అవుతుంది అని అంటున్నారు. అందుకే ఈ ఫైట్ కోసం సుమారు రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు అని తెలుస్తోంది. దీంతో ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చేసిన ట్రైన్ – హెలీకాప్టర్ సీన్‌ను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. మరి సీన్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే. అప్పుడు ‘గేమ్ ఛేంజర్’ వస్తుంది అంటున్నారు కాబట్టి.