‘జులాయి’ (Julayi) సినిమాల్లో మాదిరి షార్ట్ టైంలో డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా యువత తప్పుడు మార్గాలను ఎంచుకోవడం అందరినీ కలవరపెట్టే విషయం. తెలివి తేటలను టెక్నాలజీని తప్పుగా వాడుకోవడం వంటి సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెద్ద దొంగగా మారి.. ఏకంగా సినీ నటిని వలలో పడేసుకుని తిప్పుకున్నాడట. ‘ప్రేమ గుడ్డిది’ అని అనుభవజ్ఞులు చెప్పిన మాటలకి దీనిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. ఓ దొంగ (Thief), సినీ నటిని ప్రేమించిన విచిత్రమైనటువంటి సంఘటన..
మహారాష్ట్రలోని షోలాపూర్లో చోటు చేసుకుంది. పంచాక్షరి స్వామి అనే 37 ఏళ్ళ వయసు కలిగిన వ్యక్తి.. తాను మైనర్ గా ఉన్న రోజుల నుండే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.పెద్ద వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేయడం ఇతనికి అలవాటు. ముఖ్యంగా బంగారు నగలు వంటి వాటిని కాజేసి.. వాటిని కరిగించి బిస్కెట్లుగా చేసి అమ్మేయడం అనేది ఇతను జాబ్ గా పెట్టుకున్నాడు. అలా దొంగిలించిన సొమ్ములో దాదాపు రూ.3 కోట్లు పెట్టి ఓ ఇల్లు నిర్మించుకున్నాడట.
ఇదే క్రమంలో ఓ నటితో కూడా ఇతను పరిచయం పెంచుకున్నాడట. తర్వాత ఆమెను ప్రేమలో పడేయడం కూడా జరిగిందట. కానీ ఇతను దొంగ (Thief) అనే విషయం ఆ అమ్మాయికి తెలీదట. అయితే అనుకోకుండా ఇతను ఓ కేసులో పట్టుబడగా.. విచారణలో పోలీసులు మొత్తం తెలుసుకుని షాక్ అయినట్టు సమాచారం. అటు తర్వాత ఆ నటికి కూడా విషయం తెలిసి షాకైనట్టు సమాచారం.