Rajinikanth: ‘పెద్దన్న’లో ఈ వెరైటీ కాంబినేషన్‌ చూశారా?

కొన్ని కాంబినేషన్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని ఎలా సెట్‌ చేసేర్రా బాబూ అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. టాలీవుడ్‌లో ఇలాంటి ఓ కాంబినేషన్‌కి సంబంధించిన పిక్‌ ఒకటి వైరల్‌ అవుతోంది. అందులో దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ నటులు అందరూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే… వీళ్లంతా ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది మేం ఏ పిక్‌ గురించి చెబుతున్నామో, ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో. అఁ… ‘పెద్దన్న’ అలియాస్‌ ‘అన్నాతె’ సినిమా గురించే ఇదంతా.

ఈసినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఇందులో ఐదుగురు స్టార్స్‌ కనిపిస్తారు. రజనీకాంత్‌, ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్‌ ఆ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారి గురించే ఆ వైరల్‌ పిక్‌ కూడా. హెడ్డింగ్‌లో చెప్పినట్లు 1970, 1980, 1990, 2000, 2010 నాటి స్టార్లు వీళ్లంతా అనేది దాని అర్థం. పెద్దన్న’ హీరో రజనీకాంత్‌ 1970ల నాటి హీరో అన్న విషయం తెలిసిందే. ఇక ఖుష్బూ 1980ల కాలంలో నాయికగా ఎంట్రీ ఇచ్చారు.

మీనా అయితే 1990ల నాటి అందం. ఇక నయనతార 2000 నుండి ఇప్పటికీ స్టార్‌గా రాణిస్తున్నారు. మిగిలింది కీర్తి సురేశ్‌. ఈమె 2010 నుండి నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. అదీ.. వైరల్‌ పిక్‌ మేటర్‌.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus