ప్రముఖ గాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కేకే ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ తన చివరి శ్వాస వరకు పాటనే ప్రాణంగా బతికారు. ఇకపోతే ఈయన గుండెపోటుతో మంగళవారం సాయంత్రం ఆకస్మిక మరణం పొందడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ఈయన మృతికి ప్రగాఢ సానుభూతి వెల్లడించారు. ఇకపోతే ఆయన మరణానంతరం చాలామంది కేకే వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆతృత కనబరుస్తున్నారు..
వ్యక్తిగత విషయానికి వస్తే కేకే ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి చాలా మందికి తెలియదు. కేకే భార్య జ్యోతిలక్ష్మి తన చిన్నప్పటి స్నేహితురాలు. వీరిద్దరి మధ్య పరిచయం ఆరవ తరగతి లో మొదలయ్యి వారితో పాటు వారి స్నేహం పెరుగుతూ ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోని వీరిద్దరి ప్రేమ బంధాన్ని 1991లో మూడుముళ్ల బంధంతో పెను వేసుకున్నారు. ఇక కేకే భార్య జ్యోతి మంచి చిత్రకారిణి.
ఇక కేకే వివాహమైన తర్వాత గాయకుడు కాక ముందు తాను ముంబైలో సేల్స్ మెన్ గా పని చేసేవారు. జీవితాన్ని ముందుకు కొనసాగించడం కోసం ఆయన కళలను నెరవేర్చడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఈయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే తన భార్య జ్యోతి స్ఫూర్తితో తానే సేల్స్ మెన్ ఉద్యోగం మాన్పించి అతనిని గాయకుడిగా అవకాశాలకోసం తనని ఎంతగానో ప్రోత్సహించింది. ఇలా కేకే ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం వెనుక తన భార్య జ్యోతిలక్ష్మి ప్రస్థానం ఎంతో ఉందని చెప్పవచ్చు.
ఈ విధంగా ఆయన తన ఉద్యోగాన్ని మానేసి సింగర్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో 1994 లో వ్యాపార ప్రకటనలకు జింగిల్స్ పాడే అవకాశం లభించింది. అలా అవకాశాలను అందిపుచ్చుకొన్న కేకే బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పాపులారిటిని సంపాదించుకున్నారు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!