Sushmita Sen: మాజీ ప్రియుడు వల్లే లలిత్ మోడీ సుస్మితసేన్ కి బ్రేకప్ అయ్యిందా?

  • September 6, 2022 / 04:28 PM IST

ప్రపంచ మాజీ సుందరి నటి సుస్మితసేన్ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ప్రపంచ మాజీ సుందరిగా,నటిగా మోడల్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏకంగా పలువురు సెలబ్రిటీలు క్రికెటర్లు బిజినెస్ మెన్ లతో రిలేషన్ లో ఉంటూ తరచు వార్తలలో నిలుస్తున్నారు.ఈ విధంగా ఈమె ఇప్పటికే ఎంతోమందితో రిలేషన్ లో ఉండి బ్రేకప్ చెప్పుకోక తాజాగా ఐపీఎల్ ఫౌండర్ మాజీ చైర్ పర్సన్ లలిత్ మోడీతో రిలేషన్ లో ఉన్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే లలిత్ మోడీ సుస్మిత సేన్ తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ తాను తన జీవిత భాగస్వామితో రిలేషన్ లో ఉన్నానని పెళ్లి చేసుకోకపోయినా తనతో రిలేషన్ లో ఉన్నానంటూ సుస్మిత సేన్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆశ్చర్యపోయారు.లేటు వయసులో ఘాటు ప్రేమలు ఏంటి అంటూ పెద్ద ఎత్తున లలిత్ మోడీపై ట్రోల్ చేశారు.

ఇకపోతే లలిత మోడీతో ప్రేమలో ఉన్నటువంటి సుస్మితసేన్ తాజాగా ఆయనతో విడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లలిత్ మోడీ సుస్మిత సేన్ తో ప్రేమలో ఉన్నప్పుడు ఇంస్టాగ్రామ్ లో తన పేరును జోడించారు అదేవిధంగా తనతో కలిసి దిగిన ఫోటోని కూడా ఇంస్టాగ్రామ్ డీపీగా పెట్టుకున్నారు.అయితే ప్రస్తుతం ఈయన సుస్మిత సేన్ పేరును తొలగించడమే కాకుండా తన ప్రొఫైల్ కూడా మార్చినట్లు తెలుస్తోంది.

ఇలా ఈయన ఇన్స్టాగ్రామ్ లో మార్పులు చేయడంతో సుస్మిత సేన్ తో బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా సుస్మిత సేన్ తో ఈయన విడిపోవడానికి గల కారణం సుస్మిత సేన్ మాజీ ప్రియుడు కారణమని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా సుస్మితసేన్ తన మాజీ ప్రియుడు రోహ్మాన్‌తో కలిసి సినిమాలకు షాపింగ్ మాల్స్ కు వెళ్లడం వల్ల లలిత్ మోడీ తనకు బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus