Akhil: అఖిల్ 100 కోట్ల సినిమా.. అసలు ఉందా లేదా?

అక్కినేని అఖిల్  (Akhil Akkineni)  తన కెరీర్ లో బిగ్ సక్సెస్ కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ (Agent)  సినిమాతో నిరాశ ఎదుర్కొన్నప్పటికీ, యూవీ క్రియేషన్స్ తో మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు అనిల్ తో కలిసి ధీర అనే టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేసుకుని, దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ప్రారంభించాలని ప్లాన్ చేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ హఠాత్తుగా ఆగిపోవడం ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.

Akhil

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నాగార్జున (Nagarjuna) స్వయంగా ఈ ప్రాజెక్ట్ పై హోల్డ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఏజెంట్ మూవీ ఫెయిల్యూర్ తరువాత మరో పెద్ద బడ్జెట్ సినిమా చేయడం సరైన నిర్ణయం కాదనిపించిందట. అఖిల్ కమర్షియల్ సక్సెస్ సాధించి తర్వాతే మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని నాగార్జున సూచించారట. అఖిల్ కెరీర్ స్థిరపడేలా ప్రణాళికలో మార్పులు చేసేందుకు అన్నపూర్ణ బ్యానర్ లో మరొక చిన్న బడ్జెట్ సినిమా చేయాలని నిర్ణయించారు.

అఖిల్ తదుపరి సినిమా గురించి వార్తలు వస్తున్నాయి, దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరుతో రాయలసీమ నేపథ్యంలో ఒక లవ్ స్టోరీ చేయడానికి అఖిల్ సిద్ధమయ్యాడు. ఈ కథా కథనాలు 1980 కాలంలో జరిగేలా మురళి కిషోర్ అబ్బూరు తన ప్రత్యేక శైలిలో స్క్రిప్ట్ సిద్ధం చేసారని అంటున్నారు. అందులో అఖిల్ కొత్త లుక్ లో కనిపిస్తాడని సమాచారం. నటనలో మెరుగుదల సాధించడానికి, పాత్రకు తగ్గట్టుగా తనను తాను మారుస్తాడని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మితం కానుందని టాక్. బడ్జెట్ విషయంలో యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కంటెంట్ లో మాత్రం పటుత్వం చూపించే ప్రయత్నం చేస్తున్నారట. సినిమా కథలో ఉన్న మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సినీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత UV ప్రాజెక్ట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus