Allu Arjun, Trivikram: తొలి సినిమాతో త్రివిక్రమ్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరనుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హిట్ కాంబినేషన్లలో బాలయ్య (Nandamuri Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ పాపులర్ కాగా అలాంటి కాంబినేషన్లలో బన్నీ (Allu Arjun) త్రివిక్రమ్ (Trivikram) కాంబో కూడా ఒకటి. ఈ కాంబోలో తెరకెక్కిన జులాయి (Julayi) , సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) , అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయనే సంగతి తెలిసిందే. అయితే బన్నీ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయని తెలుస్తోంది.

Allu Arjun, Trivikram

పుష్ప ది రూల్ (Pushpa 2) తర్వాత బన్నీ నటించే సినిమా ఇదేనని 2025 సంవత్సరం ఫస్టాఫ్ లో ఈ సినిమా షూట్ మొదలుకానుందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ రిలీజైన తర్వాత మూడు నెలలు రెస్ట్ తీసుకుని బన్నీ ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమాలకు భిన్నమైన కథతో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ సైతం కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏడాది సమయం కేటాయించారంటే మూవీ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. బన్నీ సైతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో పని చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. బన్నీకి ఇప్పటికే ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత పెంచే విధంగా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బన్నీ త్రివిక్రమ్ కాంబో ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి. అల్లు అర్జున్ పారితోషికం 125 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ 2026 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేవర టాక్ కలెక్షన్లను డిసైడ్ చేయనుందా.. కలెక్షన్ల రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus