Devara: దేవర టాక్ కలెక్షన్లను డిసైడ్ చేయనుందా.. కలెక్షన్ల రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?

రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో చరణ్ (Ram Charan) , తారక్  (Jr NTR)   హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటించిన దేవర (Devara) మూవీ విడుదలకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. దేవర మూవీ టాక్ ఈ సినిమా కలెక్షన్లను డిసైడ్ చేయనుంది. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు రావడం కష్టమేం కాదు.

Devara

దేవర సినిమాకు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ట్రైలర్ విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా నెగిటివిటీ క్రమంగా తగ్గుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. సినిమాలో మొదటి 15 నిమిషాల తర్వాత ప్రేక్షకులు మరో కొత్త ప్రపంచం చూస్తున్నామని ఫీలవుతారని తారక్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దేవర సినిమాలో ఆయుధాలను పూజిస్తారని తారక్ తెలిపారు.

ఆయుధాలు వాళ్ల మనుగడ, జాతిని సూచిస్తాయని వాటి కోసం వాళ్లు ఎంతకైనా తెగిస్తారని తారక్ కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ కలెక్షన్ల రికార్డ్ ను దేవర బ్రేక్ చేయడం సాధ్యం అవుతుందో లేదో చూడాల్సి ఉంది. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూసి సినిమా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాల బిజినెస్ రేంజ్ పెరగాలంటే దేవర సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావాల్సి ఉంది. దేవర1 మూవీ విడుదలైన తర్వాత దేవర2 గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ ప్రమోషన్స్ కు తారక్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండగా నార్త్ లో ఈ సినిమా వసూళ్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో అనే చర్చ జరుగుతోంది.

మహేష్ బాబు ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్న రాజమౌళి?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus