Allu Sirish: సోషల్‌ మీడియాను వాడుకోవడంలో ‘అల్లు’ తర్వాతే ఎవరైనా!

గత కొంతకాలంలో అల్లు శిరీష్‌ సోషల్ మీడియా పోస్టులు చూస్తే… అందులో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ గురించి కొన్ని పోస్టులు కనిపిస్తాయి. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అని చాలామంది అనుకున్నారు. దానికి సంబంధించి ఎవరివైపు నుండి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఆ పోస్టులు ఏదో సాధారణ పోస్టులు కాదు. ఇద్దరి మధ్య ‘స్నేహం’ కొనసాగుతోందని మాత్రం అర్థమైపోతుంది. అయితే ఇదంతా సినిమా ప్రచారం కోసమేనా? అవుననే అనిపిస్తోంది.

అల్లు శిరీష్ – అను ఇమ్మాన్యుయేల్‌ కలసి నటిస్తున్న ఓ సినిమా పోస్టర్‌, టైటిల్‌ను ఈ రోజు లాంచ్‌ చేశారు. ఆ సినిమా పేరు ‘PREMA కాదంట’. రాకేశ్‌ శశి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ పోస్టర్లు మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రేమ నేపథ్య సినిమా అని కొట్టొచ్చినట్లు పోస్టర్లలో కనిపిస్తోంది. శిరీష్‌ నటిస్తున్న, నటించిన సినిమాల మీద ఇటీవల కాలంలో పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ పెద్దగా రాలేదు. కానీ ఈ సినిమాతో అది కనిపిస్తోంది.

ఇదంతా పక్కనపెడితే… ఈ సినిమా ఫీల్‌ను జనాలకు ముందుగా పంపించే ఉద్దేశంతోనే శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ అలా సోషల్‌ మీడియాలో ‘స్నేహం’ పోస్టులు పెట్టారని అనిపిస్తోంది. బాలీవుడ్‌లో ఇలాంటి ప్రచారం ఎక్కువగా జరుగుతుంటుంది. దానిని చూసి చేశారో, లేకపోతే కావాలనే చేశారో కానీ శిరీష్‌ టీమ్‌ అయితే సోషల్‌ మీడియాను ఈ విషయం బాగానే వాడుకుందని అర్థమవుతోంది. ఆ మాటకొస్తే ‘అల్లు’ వాళ్ల స్టైలే ఇది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus