రెండున్నర గంటల సినిమానా?… ఇటీవల కాలంలో సినిమా నిడివి గురించి పరిస్థితి ఇలా మారిపోయింది. ఓపిక తగ్గడమో, నిడివి ఎక్కువైతే అనవసర కంటెంట్ వస్తోంది అనే ఫీలింగ్ రావడమో తెలియదు కానీ… పెద్ద సినిమాలు అంటే పెద్దగా ఇష్టపడటం లేదు. అయితే ఒక్కోసారి మూడు గంటల సినిమాను కూడా ఇష్టపడుతున్నారు. అయితే అంతసేపు ఎంగేజ్ చేస్తేనే అనేది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నిడివి గురించి ఎందుకొచ్చింది చర్చ అనుకుంటున్నారా? దీనికి కారణం బాలీవుడ్ నుండి వచ్చిన ఓ పుకారు.
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన సినిమా గురించి బయటకు వచ్చిన ఓ పుకారు వల్లనే నిడివి టాపిక్ డిస్కషన్‌లోకి వచ్చింది. బాలీవుడ్ సమాచారం ప్రకారం… ఈ సినిమా నిడివి సుమారు మూడున్నర గంటలు అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. సినిమా సెన్సార్‌కు అంత నిడివితోనే పంపించారని, కాబట్టి సినిమా అంతే ఉంటుంది అంటూ సోమవారం సాయంత్రం వార్తలు గుప్పుమన్నాయి.
అంతేకాదు… ఈ రోజుల్లో ఇంత పెద్ద సినిమాను ఒక్క ఇంటర్వెల్‌తో చూడటం కష్టమని, అందుకే (Animal) సినిమాకు రెండు ఇంటర్వెల్స్ ఇస్తారు అంటూ మరో పుకారును సృష్టించారు. సందీప్ తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’ నిడివి కూడా ఎక్కువ కావడంతో ఈ సినిమాకు అదే చేస్తారు అని కూడా వార్తలొచ్చాయి. అయితే దీనిపై సినిమా సన్నిహిత వర్గాలు స్పందించాయి. అలాంటిదేం లేదని, సినిమా ఎడిటింగ్, సెన్సార్ కాపీ లాంటివి ఇంకా ఏమీ సిద్ధం కాలేదని చెప్పాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదు, సినిమాకు సంబంధించి సెన్సార్ వర్క్ ఇంకా షురూ కాలేదని టీమ్ అంటోంది. దాంతోపాటు రన్ టైం కూడా లాక్ కాలేదని చెబుతోంది. అయితే ఒకవేళ పనులు పూర్తి అయితే నిడివి ఇంతే ఉంటుందా? ఉందదా అనే విషయంలోనూ క్లారిటీ లేదు. ఈ సంగతి తేలాలంటే డిసెంబరు 1 రావాల్సిందే. అంతకుముందే సెన్సార్ రిపోర్ట్ బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు కూడా తెలుస్తుంది.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!