“అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు” అంటూ బండ్ల గణేష్ ఓ ఘాటు ట్వీట్ వేశాడు. సాధారణంగా సందర్భం లేకుండా బండ్ల గణేష్ ఇలా కామెంట్ చేసే రకం కాదు. తన మనసులో ఏది ఉన్నా ఏదో ఒక రకంగా బయట పెట్టేస్తాడు. ఇప్పుడు అతను చేసిన కామెంట్స్ నిర్మాత బన్నీ వాస్ గురించి అని చాలా మంది అనుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు.
Bandla Ganesh, Bunny Vasu
ఇటీవల ‘మిత్రమండలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాస్ ‘మిత్రమండలి’ సినిమా ట్రైలర్ పై నెగిటివ్ కామెంట్స్ చేయించిన వాళ్ళ పై మండిపడ్డాడు. ‘మీరు ట్రోలింగ్ ఏదో చేయిస్తే.. బన్నీ వాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో.. అది నా వెంట్రుక..’ అంటూ బన్నీ వాస్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు ‘నెగిటివ్ ట్రోలింగ్ చేయడానికి ఎక్కువ డబ్బులు తీసుకోవాలని’ కూడా సూచించాడు. ‘పొగడటానికి అయితే తక్కువ తీసుకున్నా పర్వాలేదు.. నెగిటివ్ గా చేస్తున్నప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోండి’ అంటూ ట్రోలింగ్ చేయించడంలో అనుభవం ఉన్నట్లు బన్నీ వాస్ పలకడం జరిగింది. వీటిని కొంతమంది టార్గెట్ చేసి బన్నీ వాస్ ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
మరోపక్క ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వెళ్ళినప్పుడు బండ్ల గణేష్…అల్లు అరవింద్ పై సెటైర్లు విసిరాడు. వాటిపై బన్నీ వాస్ స్పందించడం జరిగింది. ‘బండ్ల గణేష్ కామెంట్స్ తో మేము చాలా హర్ట్ అయ్యాము. మా సినిమా హిట్ అయ్యిందని అందరం హ్యాపీగా ఉంటే వచ్చి మా మూడ్ స్పాయిల్ చేశాడు’ అంటూ బండ్ల గణేష్ పై బన్నీ వాస్ ఘాటుగా స్పందించడం జరిగింది. అందుకే బండ్ల గణేష్ ఇప్పుడు ఇలాంటి నెగిటివ్ ట్వీట్ వేసినట్టు అర్థం చేసుకోవచ్చు.