బిగ్ బాస్ కి కోపం వచ్చింది… కానీ పార్షియాలిటీ ఎందుకు..!

  • September 21, 2024 / 12:30 PM IST

‘బిగ్ బాస్ సీజన్ 8’ రసవత్తరంగా మారింది. టాస్కులు, అందులో కంటెస్టెంట్ల గొడవ, తిట్టుకోవడం, వీకెండ్లో హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడం వంటి వ్యవహారాలు అన్నీ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ ఇస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే, బిగ్ బాస్ ప్రతి సీజన్లోనూ ఎవరొకరు… ఏకంగా బిగ్ బాస్..ని వ్యతిరేకించి మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. మొదటి సీజన్లో విన్నర్ శివ బాలాజీ (Siva Balaji) , సెకండ్ సీజన్లో బాబు గోగినేని, సీజన్ 3 లో పునర్నవి (Punarnavi Bhupalam)… ఇలా చూసుకుంటే వస్తే గత సీజన్లో శివాజీ (Sivaji) కూడా ఉన్నాడు.

Bigg Boss

సీజన్ 7 లో శివాజీ  చాలా ఎక్కువసార్లు ‘బిగ్‌బాసా.. బొక్క..ఎవడైనా నాకు ఈక ముక్క’ అంటూ దారుణంగా వ్యతిరేకించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అప్పుడు బిగ్ బాస్ ఏమీ మాట్లాడలేదు. శివాజీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ వరకు ఉన్నాడు. అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ (Bigg Boss) పై అభయ్ నవీన్   (Abhay Naveen)  కూడా నోరు పారేసుకున్నాడు. ‘తినడానికి టాస్కులు ఇస్తున్నావా.. తినకుండా ఉండడానికి టాస్కులు ఇస్తున్నావరా బిగ్ బాస్, నీకు దిమాక్ ఉందా? హౌస్ లో పదిమందికి పైగా ఉంటే ముగ్గురు మాత్రమే ఎలా వంట చేస్తారు, బొక్కలో డెసిషన్స్.. నువ్వు’ అంటూ అభయ్ నోరు పారేసుకోవడం జరిగింది.

ఇవి బిగ్ బాస్ ను (Bigg Boss) హర్ట్ చేసినట్టు ఉన్నాయి. ‘నా రూల్స్ నా ఇష్టం. నియమాలు పాటించే వాళ్ళు హౌస్లో ఉండండి. లేదు అంటే ఇప్పుడే డోర్స్ తీయడం జరుగుతుంది. ఇష్టంలేని వాళ్ళు హౌస్లో నుండి వెళ్లిపోవచ్చు’ అంటూ పరోక్షంగా అభయ్ నవీన్ ను ఉద్దేశిస్తూ చెప్పాడు బిగ్ బాస్. అందుకు అతను.. ‘ఏంటి జోకులు వేసినందుకు కూడా ఫీలవుతావా.. బిగ్ బాస్?’ అంటూ అభయ్ నవీన్ అన్నాడు. దీంతో బిగ్ బాస్ నేరుగా అతన్ని టార్గెట్ చేశాడు.

‘ క్లాన్ టీం చీఫ్ అభయ్.. రాజే అలా ప్రవర్తిస్తే ప్రజల నుంచి ఏం ఆశించగలం..? హద్దు మీరు ప్రవర్తించినందుకు టీం అంతా శిక్ష అనుభవించాల్సిందే. మీ క్లాన్ నుంచి అందరూ చీఫ్ కంటెండెర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు.’ అంటూ అతనికి అతని టీంకి కూడా పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే గత సీజన్లో శివాజీకి ఇలాంటి పనిష్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? అని నెటిజెన్లు బిగ్ బాస్ పై కామెంట్లు చేస్తున్నారు.

హిట్టు సినిమాకి కూడా కనీసం 30 రోజులు ఆగలేదుగా.!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus