Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

‘స్పిరిట్‌’ (Spirit) సినిమా గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో భారీగా ట్రెండింగ్‌లో ఉంది. ఏ సోషల్‌ మీడియా చూసినా, ఎంటర్‌టైన్మెంట్‌ న్యూస్‌ వెబ్‌సైట్లు చూసినా ఈ సినిమా గురించి చర్చిస్తున్నారు. దానికి కారణం ఆ సినిమా విషయంలో జరుగుతున్న వరుస పరిణామాలే. భారీ పాన్‌ ఇండియా సినిమా అని చెబుతున్న ఈ ప్రాజెక్ట్‌ హీరోయిన్‌ మారిపోయింది. ఓ బోల్డ్‌ ఇమేజ్‌ ఉన్న కథానాయిక హీరోయిన్‌గా వచ్చింది, ఇప్పుడు సినిమా కథ లీక్‌ చేసేస్తున్నారు అని దర్శకుడి ట్వీట్‌.

Deepika Padukone

ఇలా వరుసగా జరగడానికి కారణం కొన్ని సీన్స్‌ అని అంటున్నారు. ఇందులో కీలకమైన విషయం, అసలు అనుమానం బయటకు రావడానికి కారణం కొత్తగా ఎంపిక చేసుకున్న హీరోయినే అని చెప్పొచ్చు. ‘స్పిరిట్‌’ సినిమాలో ముంబయి డార్క్‌ సైడ్‌ను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం జరుగుతోంది అనేది పోస్టర్‌, టైటిల్‌ చూస్తే చెప్పేయొచ్చు. స్పిరిట్‌ స్మగ్లింగ్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఈ క్రమంలో కొన్ని బోల్డ్‌ సీన్స్‌ సినిమాలో పెట్టారట సందీప్‌ రెడ్డి వంగా.

అంటే ‘యానిమల్‌’ (Animal) సినిమాలోని సీన్స్‌ లాంటివి అన్నమాట. వాటి విషయంలోనే దీపిక పడుకొణె నో చెప్పిందట. ఇప్పుడు అదే సమస్యగా మారింది అని అంటున్నారు. నిజానికి దీపికా పడుకొణె (Deepika Padukone) బోల్డ్‌ సీన్స్‌కు వ్యతిరేకం కాదు. ఏకంగా ‘ట్రిపుల్ ఎక్స్‌: జాండర్‌ కేజ్‌’ లాంటి హాలీవుడ్‌ సినిమాలో అందాలు ఆరబోసింది కూడా. ఇక ‘గెహ్రాయియాన్‌’ (Gehraiyaan) అనే బాలీవుడ్‌ సినిమాలో కూడా అదే పని చేసింది. అయితే ఇప్పుడు ఆమె ఓ బిడ్డకు తల్లి. ఈ నేపథ్యంలో బోల్డ్‌ సీన్స్‌ వద్దనుకుందట. దీంతో సినిమా టీమ్‌ మధ్య చర్చ జరిగింది.

ఆ క్రమంలో ఆమె తప్పుకుంది అని అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అయితే ఈ విషయంలో సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వ్యవహారశైలి దీపికకు నచ్చలేదట. తన వర్క్‌ స్టైల్‌ విషయంలో విమర్శలు బయటకు రావడంతో ఆమె హర్టయింది అంటున్నారు. ఈ క్రమంలో ఆమె టీమ్‌లోని కొందరు, సన్నిహితులు ఈ సినిమా కథ లైన్‌ గురించి బయట లీకులు ఇస్తున్నారు అని సమాచారం. అందుకే సందీప్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు అని సమాచారం. చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో.

నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus