‘బ్రహ్మా ఆనందం’ (Raja Goutham) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత చాలామంది ‘బ్రహ్మానందాన్ని (Brahmanandam) చిరంజీవి (Chiranjeevi) అలా ఎలా అంటారు? ఆయన్ను తక్కువ చేసి ఎలా మాట్లాడతారు అంటూ ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. దీనిపై చిరంజీవి అయితే ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు బ్రహ్మీ కూడా ఎక్కడా ఈ విషయం గురించి మాట్లాడలేదు. అయితే ‘బ్రహ్మ ఆనందం’ సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.
తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham), వెన్నెల కిషోర్‌తో కలసి బ్రహ్మానందం నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రబృందం విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. బ్రహ్మానందం సినిమా అనగానే, ప్రేక్షకులు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేయరు. బాగుంటే చూస్తారు. లేకపోతే చూడరు అని అన్నారు బ్రహ్మానందం. ‘మనం ఇంత గొప్ప వాళ్లం’ అన్న విషయం తలకెక్కకుండా చూసుకోవాలి. ‘నేనెంత గొప్పవాడినో చూడు’ అంటూ ఎవరూ భుజకీర్తులు తగిలించుకోకూడదు.
అలా చేస్తే భుజాలకు పుండ్లు పడతాయి తప్ప ఉపయోగం లేదు. ఎప్పుడూ ఒక సగటు మనిషిగా ఉండాలి అని చెప్పారు బ్రహ్మానందం. ఈ మాటలు ఆయన ఎందుకు అన్నారో తెలియడం లేదు కానీ.. రీసెంట్‌గా ‘బ్రహా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి స్పీచ్‌కి దినిని కొంతమంది సింక్ చేస్తున్నారు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత మన పిల్లల్ని అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలన్న ఆలోచన ఏ తండ్రీ చేయకూడదు. వాళ్లను స్వేచ్ఛగా వదిలేయండి. నిబంధన పెట్టడం వల్ల యువత గాడి తప్పుతోందని నా అభిప్రాయం అని బ్రహ్మీ చెప్పుకొచ్చారు.
ఈ నమ్మకంతోనే రాజా గౌతమ్ సినిమా స్క్రిప్ట్‌ల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదు అని బ్రహ్మానందం తెలిపారు. బ్రహ్మానందం ఇప్పుడు ఇలా స్టార్ నటుడి అవ్వడానికి కారణం తానేనని, ‘చంటబ్బాయ్’ సినిమా సమయంలో తాను చేయి అందించడం వల్లే బ్రహ్మీ నటుడిగా మారి, ఈ స్థాయికి వచ్చారని చిరంజీవి ‘బ్రహ్మా ఆనందం’ వేదిక మీద చెప్పిన విషయం తెలిసిందే. నిజానికి ఇది కరెక్ట్ కూడా. ఈ విషయాన్ని బ్రహ్మీనే చెప్పాఉ. కాబట్టి బ్రహ్మానందం వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించినవి కావు.