‘పుష్ప’ సినిమా అనౌన్స్‌మెంట్ టైమ్‌లో అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ… సినిమా టైటిల్ కూడా రాసుకొచ్చాడు. అయితే అది విచిత్రమైన అక్షరాల్లో రాసేసరికి నెటిజన్లకు, ప్రేక్షకులకు అర్థం కాలేదు. అయితే సినిమా పేరు అధికారికంగా ప్రకటించేసరికి… ‘అయ్యో బన్నీ అప్పుడే ట్వీట్ చేశాడుగా’ అనుకున్నారు. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్ విషయంలోనూ ఇదే స్టైల్ వాడుతున్నారా? దర్శకుడు మోహన్‌రాజా ట్వీట్ చూస్తే ఆ డౌటే కొడుతోంది. మొన్నీమధ్య ‘లూసిఫర్’ రీమేక్ పనులు మొదలైన రోజు దర్శకుడు జయం మోహన్ రాజా ఓ ట్వీట్ చేశారు.
అందులో The HUNT Starts @jayam_mohanraja #Chiru153 massive TITLE IT IS 🎬 ur all goona go Crazy for Sure Never before Never Again 🔈🔈🎬🎬🧨 అంటూ రాసుకొచ్చారు. అందులో చూస్తే కేపిటల్ లెటర్స్‌లో HUNT కనిపిస్తోంది. అలాగే TITLE IT IS కూడా కనిపిస్తోంది. దీంతో టైటిల్ అదే అంటున్నారు. షూటింగ్ స్టార్ట్ అనో లేకపోతే పని మొదలైందనో ట్వీట్ చేయొచ్చు. కానీ వేట మొదలైంది అని ఎందుకు ట్వీట్ చేస్తారు. సినిమా పేరు HUNTER అయ్యి ఉండొచ్చని అంటున్నారు.
ఒకవేళ తెలుగులో పెట్టాలి అనుకుంటే ‘వేటగాడు’ అని పెట్టొచ్చేమో. అయితే ‘వేట’ అనే పేరు చిరంజీవి అభిమానులకు అంత రుచించదు. గతంలో ఆ పేరుతో చేసిన సినిమా దారుణ పరాజయం పాలైన విషయం తెలిసిందే.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!