Chiranjeevi: కొడుకులు నుండి చిరంజీవి ఇన్‌స్పైర్‌ అవుతారా?

సినిమా విడుదలవ్వడం, ఫలితం గురించి ఆశించకపోవడం.. ఇదీ కొంతమంది హీరోల తీరు. సినిమా విడుదలయ్యాక… ఫలితం అనుకున్నట్లుగా రాకపోతే దానికి నిరాశ చెంది ఆ కష్టాన్ని స్నేహితులతో పంచుకుంటారు. ఆ విషయాలు బయటికొచ్చి బాధపడ్డ ఫలానా హీరో అంటూ వార్తలొస్తాయి. ఈ రెండూ కాకుండా మరో రకం హీరోలున్నారు. సినిమా పోతే ఆ ఫీలింగ్స్‌ని లెటర్‌లో రాసి రిలీజ్‌ చేస్తుంటారు. ఇప్పుడు చిరంజీవి ఆఖరి స్టైల్‌ హీరోలను ఫాలో అవుతారా? ఎందుకంటే మన దగ్గర రీసెంట్‌గా ఆ పని చేసిన హీరోలు మెగాకాంపౌండ్‌ వాళ్లే.

అవును, మెగా కాంపౌండ్‌ హీరోల్లో రీసెంట్‌గా వచ్చిన ఈ మార్పు గమనిస్తే చిరంజీవి కూడా అదే పని చేస్తారు అనిపిస్తోంది. ఈ విషయం క్లియర్‌గా తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్లాలి. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్‌కి కోపం రావొచ్చు. ఎందుకంటే మేం గుర్తు చేసేవి అట్టర్‌ఫ్లాప్‌ సినిమాలు కాబట్టి. బోయపాటి శ్రీనుతో చేసిన ‘వినయ విధేయ రామ’ దారుణ పరాజయం అవ్వడంతో రామ్‌చరణ్‌ అభిమానులను ఉద్దేశించి లేఖ రాశారు. ఆ లేఖలో అప్పట్లో వైరల్‌ అయ్యింది.

ఆ తర్వాత మొన్నటికిమొన్న ‘గని’ సినిమా విడుదలై పరాజయాన్ని అందుకోవడంతో వరుణ్‌తేజ్‌ వాళ్ల అన్నయ్య చరణ్‌ను ఫాలో అయ్యాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డామని, అయితే అనుకున్నట్లుగా సినిమా రాలేదేని, దానికి అభిమానులకు సారీ అంటూ.. లేఖలో పేర్కొన్నారు. అభిమానుల మీద కన్‌సర్న్‌ చూసి మెగా ఫ్యాన్స్‌ మురిసిపోయారు. ఇప్పుడు ‘ఆచార్య’ ఫలితం మెగా ఫ్యాన్స్‌కి మింగుడుపడటం లేదు.

దీంతో ఈ సినిమా పరాజయానికి ఎవరు బాధ్యులు, ఎవరు లేఖ రాస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. తనయుల్ని ఆదర్శంగా తీసుకొని చిరంజీవి ఏమన్నా లేఖ రాస్తారా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేక ఎప్పటిలాగే ఆ సినిమా ఫలితాన్ని అక్కడితో వదిలేసి.. కొత్త సినిమా పనులు మొదలుపెడతారా అనేది చూడాలి. సినిమా ఫలితాన్ని అక్కడితో వదిలేసి కొత్త సినిమాలు చేయడం చిరుకి అలవాటు. మొన్నీ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus