మలయాళి బ్యూటీ ప్రియా ప్రియకాష్ వారియర్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘లవర్స్ డే'(మలయాళంలో ‘ఒరు ఆడార్ లవ్). ఒమర్ లులు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులోకి ‘సుఖీభవ సినిమాస్’ బ్యానర్ పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి అందించారు. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) విడుదలయ్యింది. రిలీజ్ కి ముందు ప్రియా ప్రకాశ్ ద్వారా ఈ చిత్రానికి చాలా క్రేజ్ వచ్చింది కానీ అది బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు.
వివరాల్లోకి వెళితే ఈ చిత్రంలోని క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా విసిగించిందని రివ్యూలు పేర్కొన్నాయి. దీంతో కేవలం క్లైమాక్స్ సన్నివేశాన్ని మార్చాలని దర్శక,నిర్మాతలు భావించారట. బుధవారం నుండీ… ఈ చిత్రానికి కొత్త క్లైమాక్స్ ని జతచేయనున్నట్టు దర్శకుడు ఒమర్ ప్రకటించాడు. ఈ చిత్రకుడు ఈ విషయం పై స్పందిస్తూ… “క్లైమాక్స్ సన్నివేశంలో మార్పులు చేసి మళ్ళీ చిత్రీకరించాం. పది నిమిషాల పాటు ఉండబోయే ఈ సీన్స్ ని బుధవారం నుండీ జతచేయనున్నాం. నేను డైరెక్ట్ చేసిన మూడో చిత్రమిది. నా మొదటి రెండు చిత్రాలు కూడా రొమాంటిక్ జోనర్ లోనే రూపొందించాను. ఇక ‘ఒరు అడార్ లవ్’ సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించాలని అనుకున్నాను.
అందుకే క్లైమాక్స్‌కు ట్రాజెడీనీ జోడించాను. కానీ ప్రేక్షకులు ఈ సన్నివేశంతో నిరాశకు గురయ్యారు. దాంతో ఆ సన్నివేశాన్ని మార్చాలని నేను… నిర్మాత నిర్ణయించుకుని మళ్ళీ తెరకెక్కించాం” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒకసారి ప్లాప్ టాక్ వచ్చిన తరువాత ఎన్ని రిపేర్లు చేసినా జనం థియేటర్లకు వెళ్ళే అవకాశం లేదు. మన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చాక మళ్ళీ కొన్ని రిపేర్లు చేసి… వేంకటేశ సీన్స్ ని జతచేసారు. అయినా జనాలు థియేటర్లకు వెళ్ళడానికి నిరాకరించి… కొన్ని సీన్లే కదా.. సోషల్ మీడియా లో చూసేద్దామని లైట్ తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్క సీన్ కోసం ప్రియా ప్రకాష్ సినిమాకి థియేటర్ కి వెళ్ళి చూస్తారా… అంటే కష్టమనే చెప్పాలి..!