Kajal Aggarwal: భర్త కోసం ఆ పని చేస్తున్న కాజల్ అగర్వాల్!
- November 16, 2021 / 06:52 PM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ గర్భవతి అని గతంలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల గురించి కాజల్ అగర్వాల్ స్పష్టత ఇవ్వలేదు. గతేడాది అక్టోబర్ నెల 30వ తేదీన కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు వివాహం జరిగింది. కాజల్ అగర్వాల్ భర్త ప్రముఖ వ్యాపారవేత్త కాగా కాజల్ భర్తకు కూడా సినిమాలపై ఆసక్తి ఉందని సమాచారం. కాజల్ భర్త సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాజల్ గర్భవతి కావడంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను సైతం వదులుకుందని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు కాజల్ భర్తను నటుడిగా మారుస్తుందని జరుగుతున్న ప్రచారంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వార్త గురించి కాజల్ అగర్వాల్ స్పందించి క్లారిటీ క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. గతంలో గౌతమ్ కిచ్లు బిజినెస్ కోసం కాజల్ తో కలిసి ఒక వీడియో షూటింగ్ లో పాల్గొన్నారు. గౌతమ్ కిచ్లుకు కూడా నటనపై బాగానే ఆసక్తి ఉందని తెలుస్తోంది.

తనకు బాగా పరిచయం ఉన్న దర్శకనిర్మాతలను తన భర్తకు అవకాశాలు ఇవ్వాలని కాజల్ కోరినట్టు సమాచారం. ప్రాధాన్యత ఉన్న పాత్రలను తన భర్తకు ఇవ్వాలని కాజల్ అగర్వాల్ సూచించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కాజల్, గౌతమ్ కిచ్లు కలిసి నటిస్తారేమో చూడాల్సి ఉంది. గతంతో పోలిస్తే కాజల్ కు హవా తగ్గినా ఆమెకు సినిమా ఆఫర్లు భారీగానే వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా కాజల్ నటిస్తున్నారు.
పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!












