ఓటీటీల్లో కూడా సినిమా రిలీజ్‌లు వాయిదా పడతాయా అని మొన్న చదువుకున్నాం గుర్తుందా? ఆ ‘క్రాక్’ ఓటీటీ రిలీజ్ గురించే. అయితే ఇప్పుడు దాని గురించి మరో ఆసక్తికరమై విషయం బయటికొచ్చింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను నిలిపేయడానికి చిత్రబృందం తిరిగి ‘ఆహా’కు కొంత మొత్తం చెల్లించిందనేది తాజా ఖబర్. అయితే ఈ విషయంలో రెండు వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు.. ఉండదు కూడా. అయితే ఏం జరిగిందనేది బయటికొచ్చింది.
నిజానికి ఈ నెల 29న ‘ఆహా’లో ‘క్రాక్’ విడుదల కావాల్సి ఉంది. అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ‘సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. వచ్చే నెల ఐదున సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో సినిమా ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఓటీటీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అక్కడి వరకు అందరికీ తెలిసిందే. అయితే ఈ వాయిదా వేయడానికి చిత్రబృందం కోటి రూపాయాలకు పైగా తిరిగి ఇచ్చుకోవాల్సిందట.
‘క్రాక్’ విడుదలకు ముందు సుమారు ₹8 కోట్లకు ‘ఆహా’ కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమా మంచి విజయం అందుకోవడం, ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతుండటంతో అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తే ఎలా అని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా సినిమా వాయిదా వేశారు. కానీ దాని వెనుక ఇంత జరిగిందా అని ఓటీటీయన్లు అనుకుంటున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!