ఒక సినిమా విడుదలై.. జనాలు ఆ సినిమాను రిజెక్ట్ చేసిన తర్వాత కూడా సినిమా యూనిట్ “మా సినిమా సూపర్ హిట్, మా సినిమా బంపర్ హిట్” అని చంకలు గుద్దుకుంటూ ప్రచారం చేయడం అనేది పాత పద్ధతి. సినిమా విడుదలైన రోజే ఫస్ట్ షో లేదా ప్రీమియర్ షో టాక్ ను బట్టి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పేసి.. అవును మా సినిమా ఫ్లాప్ అయ్యింది అని ఒప్పుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్ అయ్యింది. మొన్నామధ్య రామ్ చరణ్, తర్వాత రాహుల్ రామకృష్ణ ఇప్పుడు రాయ్ లక్ష్మీ ఆ పద్ధతిని ఫాలో అవుతున్నారు.
నిన్న విడుదలైన “వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ”కి కనీస స్థాయి రివ్యూస్ కానీ కలెక్షన్స్ కానీ రాలేదు. దాంతో దర్శకనిర్మాతలు వెంటనే సినిమా సూపర్ హిట్ అని ప్రమోషన్స్ మొదలెట్టినా.. రాయ్ లక్ష్మీ మాత్రం సింపుల్ గా తన ఇన్స్రాగ్రామ్ లో జిమ్ సెషన్ ఫోటో ఒకటి అప్లోడ్ చేసి.. “ది ఆర్ట్ ఆఫ్ క్నోయింగ్ ఈజ్ క్నోయింగ్ వాట్ టు ఇగ్నోర్” అని ఒక పోస్ట్ పెట్టింది. అంటే.. కొన్నిటిని ఇగ్నోర్ చేయడమే మంచిది అని అర్ధం. మరి ఆమె ఇగ్నోర్ చేసింది సినిమానా లేక దర్శకనిర్మాతలనా అనేది తెలియదు కానీ.. సినిమా మాత్రం ఫ్లాప్ అని అర్ధమవుతోంది.
View this post on InstagramThe art of knowing is knowing what to ignore. 👍😊🌹
A post shared by Raai Laxmi (@iamraailaxmi) on