Mahesh Babu: మహేష్‌ డ్యూయల్‌ రోల్… ఈ సారైనా అవుతుందా!

మహేష్‌బాబు లాంటి అందగాడిని వెండితెరపై సింగిల్‌ ఫ్రేమ్‌లో చూస్తే అదిరిపోతుంది. అంతటి స్క్రీన్‌ ప్రజెన్స్‌ అతనిది. అలాంటిది ఒకేసారి తెరపై ఇద్దరు మహేష్‌బాబులు కనిపిస్తే.. ఆ ఫ్రేమ్‌ గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. ఈ వండర్‌ఫుల్‌ ఫ్రేమ్‌ను చూడటానికి ఫ్యాన్స్‌ చాలా రోజుల నుండి వెయిట్‌ చేస్తున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో బాలనటుడిగా డ్యూయల్‌ రోల్‌ చేశాడు మహేష్‌. హీరో అయ్యాక ఆ ప్రయత్నం చేయలేదు. గతంలో చాలాసార్లు వినిపించిన ఈ డ్యూయల్‌ రోల్‌ మాట.. త్రివిక్రమ్‌ సినిమాతో నెరవేరుతుందా?

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. దీంతో కాస్టింగ్‌ ప్రక్రియ ఓవైపు చేస్తూనే మరోవైపు కథనం విషయంలో ఫైనల్‌ ఛేంజెస్‌ చేస్తున్నారట. అందులో భాగంగానే సినిమాలో ఇద్దరు మహేష్‌లు ఉంటారనే టాక్‌ బయటికొచ్చింది. అయితే ఇందులో ఇద్దరు మహేష్‌లు ఉంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి పుకార్లు వినిపించాయి.

మహేష్‌బాబు గత సినిమాలు ‘స్పైడర్‌’, ‘మహర్షి’, ‘సర్కారు వారి పాట’ల్లో కూడా ఇలా ఇద్దరు మహేష్‌లు ఉంటారు అనే పుకార్లు వినిపించాయి. దీంతో ఫ్యాన్స్‌ బాగా ఎగ్జైట్‌ అయ్యారు. కానీ ఆ తర్వాత డబుల్ రోల్‌ పుకార్లు నిజం కాలేదు. ఇప్పుడు మరి త్రివిక్రమ్‌ అయినా ఇద్దరు మహేష్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తారేమో చూడాలి. అలాగే ఈ సినిమా పీరియాడిక్ డ్రామా అని సమాచారం. ఫ్లాష్ బ్యాక్, ప్రస్తుత కథ సమానంగా సాగుతాయని అంటున్నారు.

సినిమా షూటింగ్‌ను ఫైట్‌తో షురూ చేస్తారని తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ఓ సెట్‌ను రూపొందించారట. ఆ షెడ్యూల్‌ తర్వాత ఫ్యామిలీ సీన్స్‌ షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నారట. 11 ఏళ్ల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈ సినిమా రూపొందుతోంది. సినిమాకు ‘పార్థు’, ‘అర్జునుడు’ టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus