మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ సారి చిరంజీవి కుటుంబం ఎవరికి సపోర్టు చేస్తుంది. ఈ ప్రశ్నకు చాలామంది ఈజీగా సమాధానం చెప్పేస్తారు. ఇంకెవరికి ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కి అని. ఎందుకంటే ఇప్పటికే నాగబాబు బహిరంగంగా మద్దతు తెలిపారు కాబట్టి. అయితే చిరంజీవి ఫ్యామిలీ సపోర్టు కోసం మంచు విష్ణు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. ఈ క్రమంలో చిరంజీవి ఫ్యామిలీ, వర్గం ఓట్లను సంపాదించేలా లాక్‌లు వేస్తున్నారు. ఆదివారం జరిగిన రెండు ఘటనలు ఈ విషయాన్ని మనకు చెప్పకనే చెప్పాయి.
తన ప్యానల్‌ని ప్రకటించిన తర్వాత మంచు విష్ణు వివిధ టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తున్నారు. అలా ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవిని కలవలేదు. నామినేషన్ తర్వాత మేనిఫెస్టో ప్రకటించి.. చిరుని కలుస్తాను. నా విజన్ విన్నాక ఆయన తప్పకుండా నాకే ఓటు వేస్తారనుకుంటున్నా’’ అని విష్ణు అన్నాడు. ఆ తర్వాత సాయంత్రానికి వచ్చేసరికి… మోహన్‌బాబు స్పందించారు. ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మ గురించి, ఆయన విద్యా సంస్థల గురించి ప్రస్తవించిన విషయం తెలిసిందే.
దీనిపై మోహన్‌బాబు స్పందిస్తూ… 10వ తేదీ తర్వాత స్పందిస్తా అని చెప్పారు. అంతేకాదు తన కొడుకు మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి బరిలో ఉన్నాడని, ఆ రోజు ఓటు వెయ్యు అంటూ పవన్‌ను అడిగారు మోహన్‌బాబు. బహిరంగంగా చిరంజీవి కుటుంబాన్ని ఓటు వేయమని, మద్దతు ఇవ్వమని అడిగి మోహన్‌బాబు లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా?